కేశినేని నాని వర్సెస్ పీవీపీ… వెదవ సోది!

ప్రస్తుతం టీడీపీలో కేశినాని నాని వ్యవహారం రోజు రోజుకీ హాట్ టాపిక్ గా మారుతున్న సంగతి తెలిసిందే. వైసీపీలో రఘురామకృష్ణం రాజు వైఖరికి ఏమాత్రం తగ్గకుండా టీడీపీలో కేశినేని నాని వైఖరి ఉందనే కామెంట్లు వినిపించేస్థాయిలో వ్యవహారం సాగుతుంది. చంద్రబాబుకు చర్యలు తీసుకునే ధైర్యం లేదు కానీ… కేశినేని నాని ఎప్పుడో ఎర్రజెండా ఎగరేసేశారు. అది గ్రహించిన బాబు కొత్త అభ్యర్థిని ఎంకరేజ్ చేయగలుగుతున్నారే కానీ.. నానిపై మాత్రం చర్యలకు ఉపక్రమించలేకపోతున్నారు. ఈసమయంలో నానిపై కాస్త గట్టిగానే ఫైరయ్యారు పీవీపీ!

గత కొంతకాలంగా చంద్రబాబుకు హెడేక్ గా తయారయ్యి సొంతపార్టీని గట్టిగా విమర్శిస్తూ.. తనపై ఏ పిట్టల దొర పోటీచేసినా తాను సులువుగా గెలుస్తానని, ఆఖరికి స్వతంత్ర అభ్య‌ర్థిగా పోటీ చేసిన గెలిచే స‌త్తా తనకు ఉంద‌ని చెప్పుకుంటున్న సంగతి తెలిసిందే. దీంతో గ‌త ఎన్నిక‌ల్లో కేశినేని నానిపై వైసీపీ అభ్య‌ర్థిగా పోటీ చేసిన పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు.

“నీ బిల్డప్ ఏందయ్యా కేశినేని నాని.. నువ్వేదో అల్లూరికి ఎక్కువ, నేతాజీకి తక్కువ అన్నట్టు.. ప్రజాసేవ కోసం పుట్టానంటావు.. కానీ, దొబ్బెది బ్యాంకులని, జీతాలు ఎగదొబ్బేది కార్మికులకు.. వెరసి మన బెజవాడోళ్ళందరికి చేతిలో చిప్ప.. నోటిలో మట్టి.. వేదవ సోది ఆపి, కాస్త కొవ్వు కరిగించే పనిలో ఉండు.. తర్వాత ఎన్నికల బరిలో దొర్లుకుంటూ వద్దువు!!” అంటూ ట్విట్టర్ వేదిక‌గా విమర్శలు కురిపించారు.

దీంతో బెజవాడ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. కేశినేని నానీ హడావిడితో తన సీటుకు ఎసరొస్తుందని భావించారో ఏమో కానీ… ఉన్నపలంగా యాక్టివ్ అయ్యారు పీవీపీ.. ఇది ఒక రకంగా మంచిదేలే అంటూ కామెంట్ చేస్తున్నారు వైసీపీ కార్యకర్తలు!

కాగా… వచ్చే ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఇస్తుందా.. నేను ఎంపీ అవుతానా అనే భయం తనకు లేదని.. ఒకవేళ టీడీపీ తనకు టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతానని.. ఏ పిట్టల దొరకు సీటిచ్చినా తనకు ఇబ్బంది లేదని కేశినేని తెగేసి చెప్పిన సంగతి తెలిసిందే!