ఏపీ, తెలంగాణ పది విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త.. ఫలితాలు ఎప్పుడంటే?

చదువుకునే ప్రతి విద్యార్థికి పదో తరగతి ఫలితాలు ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పది పరీక్షలలో మంచి మార్కులు సాధించి ఆ మార్కులతో ఉద్యోగాలకు ఎంపికవుతున్న వాళ్ల సంఖ్య తక్కువేం కాదు. ఏపీకి చెందిన లక్షల సంఖ్యలో విద్యార్థులు పది పరీక్ష రాయగా ఆ విద్యార్థులలో చాలామంది పదో తరగతిలో అనుకూల ఫలితాలు వస్తాయని భావిస్తున్నారు.

 

అయితే ఏపీ పదో తరగతి ఫలితాలకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడింది. ప్రభుత్వ పరీక్షల విభాగం రాష్ట్ర సంచాలకుడు డి. దేవానందరెడ్డి మీడియాలో మాట్లాడుతూ మే రెండో వారంలో పరీక్షల ఫలితాలను విడుదల చేస్తామని చెప్పుకొచ్చారు. ఈ నెల 26వ తేదీ సమయానికి మూల్యాంకనం పూర్తి కానుందని తెలుస్తోంది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వేగంగా పరీక్ష ఫలితాలను విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

 

తెలుగు రాష్ట్రాల్లో 6.5 లక్షల మంది కంటే ఎక్కువ మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. దాదాపుగా 35,000 మంది టీచర్లు పదో తరగతి పరీక్షల కోసం పని చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా దాదాపుగా అదే సమయంలో ఫలితాలు విడుదల కానున్నాయి. ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కూడా ఆశాజనకమైన ఫలితాలను సాధించే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

 

కరోనా వల్ల గత కొన్నేళ్లలో విద్యార్థులు చదువులో వెనుకబడగా ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. విద్యార్థుల జీవితాలపై కరోనా వైరస్ ఎంతగానో ప్రభావం చూపింది. ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొనగా ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల విద్యార్థుల పాస్ పర్సంటేజ్ ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సి ఉంది.