పవన్ కళ్యాణ్ ఓవరాక్షన్.. సినిమాలకు రాజకీయాలకు తేడా తెలీదా?

సినిమాల్లో హీరో ఎలా ఉన్నా అభిమానులకు నచ్చుతుంది. హీరో చేసే పనులు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. అయితే రియల్ లైఫ్ లో కూడా హీరో అనుకుని అలాంటి పనులే చేస్తే మాత్రం విమర్శల పాలు కావాల్సి ఉంటుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేతలు ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు కష్టాల్లో ఉంటే సినిమా డైలాగ్స్ చెబుతూ పవన్ కళ్యాణ్ చేస్తున్న ఓవరాక్షన్ పై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

పవన్ అభిమానులకు పవన్ చేసే పనులు నచ్చినా వాస్తవాలు మాత్రం మరో విధంగా ఉన్నాయి. వాస్తవానికి అధికారులు ఇప్పటం గ్రామంలో ప్రహరీ గోడలను మాత్రమే కూల్చివేశారు. అయితే ఇళ్లను కూల్చివేసినట్టు సోషల్ మీడియాలో వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. రోడ్ల విస్తరణ జరిగితే గ్రామ అభివృద్ధి జరుగుతుందనే సంగతి తెలిసిందే. మరోవైపు పవన్ ఇప్పటం గ్రామ అభివృద్ధి కోసం 50 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పారు.

అయితే పవన్ ఆ డబ్బులను ఇప్పటివరకు ఇవ్వకపోవడంపై కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక్కో సినిమాకు 60 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకునే పవన్ కళ్యాణ్ 50 లక్షల రూపాయలు ఇవ్వడం కష్టమేమీ కాదు. ఇప్పటం గ్రామ అభివృద్ధి కోసం వైసీపీ ఏకంగా 6 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసిందని సమాచారం అందుతోంది.

పవన్ కళ్యాణ్ ప్రతి సందర్భంలో వార్తల్లో నిలవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోవైపు పవన్ ఆలస్యం చేయడం వల్ల ఆయనతో సినిమాలను తీస్తున్న నిర్మాతలు భారీ స్థాయిలో నష్టపోతున్నారు. పవన్ కళ్యాణ్ పిచ్చికూతలు కూస్తున్నాడంటూ కొందరు నేతలు ఘాటుగా విమర్శిస్తున్నారు. ఈ విమర్శలపై పవన్ ఎలా స్పందిస్తారో చూడాలి. సినిమాలకు రాజకీయాలకు పవన్ తేడా తెలుసుకోవాలని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.