బిగ్ న్యూస్: చిరంజీవిని ఇరికించబోతున్న మోడీ!

ప్రజారాజ్యం అనే పార్టీని స్థాపించడం.. అనంతరం అనుకున్న స్థాయిలో ఫలితాలు రాకపోవడం.. తదనంతరం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం.. ఫలితంగా కేంద్రమంత్రి పదవి పొందడం! రాజకీయంగా చిరంజీవి కెరీర్ ఇది! అనంతరం పశ్చాత్తాప పడిన ఆయన… తనకు రాజకీయాలు సూట్ కావని, తాను రాజకీయాలకు అతీతంగా “అందరివాడు”లా ఉంటానని చెప్పిన సంగతి తెలిసిందే. నాటి నుంచి ప్రశాంతంగా తనకు నచ్చిన సినిమాలు చేసుకుంటూ… అభిమానులకు ఆనందాన్ని పంచుతున్నారు చిరంజీవి. ఈ సమయంలో… హస్తిన నుంచి ఒక చేదు కబురు!

ఇంట్లో తమ్ముడు తనకు తోచిన రాజకీయాలు చేసుకుంటున్నా… తన ఇంట్లో రాజకీయం ఉండొచ్చు కానీ.. తన ఒంట్లో ఇక రాజకీయం లేదని పరోక్షంగా స్పష్టం చేస్తున్నారు చిరంజీవి. అయితే ఈ సమయంలో… మోడీ నుంచి చిరుకు కబురు వచ్చిందని, కర్ణాటక ఎన్నికల అనంతరం కలిసి మాట్లాడాలని కోరారని తెలుస్తుంది. ప్రస్తుతం తెలుగు సిని ఇండస్ట్రీతో పాటు.. తెలుగు రాజకీయాల్లోనూ ఇది హాట్ న్యూస్ గా మారింది.

చాలాకాలంగా దక్షిణాదిలో జెండాపాతాలని బీజేపీ తెగ కలలు కంటున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఆ ఛాన్స్ ఇవ్వడం లేదు. గతంలో కర్ణాటక ప్రజలు ఒక ఛాన్స్ ఇచ్చినా… ప్రస్తుతం పశ్చాత్తాప పడుతున్నారని సర్వేల సారాంశం. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న కర్ణాటకలో బీజేపీకి అనుకూల ఫలితాలు రావని ఇప్పటికే మెజారిటీ సర్వేలు తేల్చేశాయి. ఈ పరిస్థితుల్లో త్వరలో ఎన్నికలు జరగబోయే తెలంగాణలో.. ఏదోలా జెండా పాతకపోతే బీజేపీ ఇక ఉత్తరాధి రాష్ట్రాల పార్టీగా మిగిలిపోతుందనే ఆందోళన కాషాయ నేతల్లో నెలకొందట!

ఇందులో భాగంగా… ఏపీలో ఎలాగూ హోప్స్ లేవు, తమిళనాట కూడా తంబీలు ఛాన్స్ ఇవ్వడం లేదు. కాబట్టి… కొద్దో గొప్పో ఆశలు కనిపిస్తున్న తెలంగాణలో ఏదోలా జెండా ఎగరెయ్యాలని బలంగా ఫిక్సయ్యింది బీజేపీ. ఇందులో భాగంగా ఇప్పటికే పూర్తి కాన్సంట్రేషన్ చేసిన అమిత్ షా… వీలున్నప్పుడల్లా వచ్చి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వెళ్తున్నారు. అయితే ఈ తరహా రాజకీయం తెలుగు రాష్ట్రాల్లో సూట్ కాదని భావించారో ఏమో కానీ… ఇకపై చిరు లాంటి సినీగ్లామర్, మంచి పేరు ఉన్న వ్యక్తిని వాడాలని బీజేపీ అధిష్టాణం భావిస్తుందట.

ఇందులో భాగంగా కర్ణాటక ఎన్నికలు పూర్తయిన అనంతరం తెలంగాణ ఎన్నికలపై పూర్తి ఫోకస్ పెట్టనుందట బీజేపీ. అందులో భాగంగా… చిరును క్రౌండ్ పుల్లర్ గా వాడుకోవాలని భావిస్తుందట. మరి అసలే సున్నిత మనస్కుడైన చిరంజీవి.. మోడీని కలిసి, మొహమాటానికి పోతారా? లేక, “నో పాలిటిక్స్ ప్లీజ్” అని సున్నితంగా తిరస్కరించి ప్రశాంతంగా సినిమాలు చేసుకుంటారా అన్నది వేచి చూడాలి!