పరిశ్రమలు వస్తున్నాయ్, ఉద్యోగాలు రాబోతున్నాయి, పరిశ్రమలను తెలుస్తున్నాం, ఉద్యోగాలు కల్పిస్తాం. ఇలా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎపుడూ ఫ్యూచర్ టెన్స్ లో మాట్లాడుతుంటారు. ప్రజలను ఫ్యూచర్ లో బతకమంటుంటారు. పైసా ఖర్చు లేకుండా ఫ్యూచర్ లో ఏమయిన సృఫ్టించవచ్చు. ఆంధ్ర ను సింగపూర్ చేయవచ్చు. అమరావతిని టోకియో లేకుంటా అస్తానా, దుబాయ్, బీజింగ్, హాంకాంగ్ లు గా తీర్చి దిద్ద వచ్చు. పైసా ఖర్చు లేకుండా ఆంధ్రని 50 యేళ్ల తర్వాత ప్రపంచంలో నెంబర్ 1 ఎకానమీ చేవవచ్చు.
గత నాలుగేళ్లుగా చంద్రబాబు ఆంధ్రప్రజలకు ఫ్యూచర్ టెన్స్ చెబుతున్నారు. ఈ రోజు కూడా ఆయన ఇలాగే మాట్లాడారు. ఈ రోజు జన్మభూమి 9వరోజు పై ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్
లో ప్రసంగించారు. ఈసమావేశంలో జిల్లాల కలెక్టర్లు,నోడల్ అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఆయన ఇలా ఫ్యూచర్ టెన్స్ లో ప్రసంగించారు.
నిన్న ఒక్క రోజే రూ.లక్ష కోట్ల పెట్టుబడులతో ఒప్పందాలు చేశాం., లక్షా 26వేల ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలు రానున్నాయి.
విశాఖలో డేటా సెంటర్ హబ్, డేటా సెంటర్ పార్కులు, సోలార్ పార్కులు. రూ.30వేల కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్ పార్కులు, రూ.40వేల కోట్లతో సోలార్ పార్కులు వస్తాయి. వర్జీనియా కు ధీటుగా విశాఖ మారుతుంది.
ప్రకాశం జిల్లాలో రూ.24,500 కోట్ల పెట్టుబడి రానుంది. ఆసియా పల్ప్ అండ్ పేపర్ మిల్స్ వస్తోంది. ప్రత్యక్షంగా 4,500మందికి, పరోక్షంగా రూ.12వేల మందికి ఉపాధి. దీనిద్వారా 50వేల మంది రైతులకు ప్రయోజనం.
రామాయపట్నం పోర్టు,భావనపాడు పోర్ట్ రానున్నాయి.
లాజిస్టిక్స్ హబ్ గా ఏపి కానుంది.
ఉత్తరాంధ్ర, రాయలసీమలో పెద్దఎత్తున పరిశ్రమల ఏర్పాటవుతాయి. వెనుకబడిన జిల్లాలలో సంపద సృష్టిస్తున్నాం.
యువతకు భారీగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం.
జన్మభూమిలో విద్యార్ధులు,ఉపాధ్యాయుల భాగస్వామ్యం అధికంగా ఉంది.
పాఠశాలల ప్రహరీగోడల నిర్మాణంపై ప్రజల్లో సంతృప్తి ఉంది.
ఇళ్ల కోసం అనేక అర్జీలు వచ్చాయి. వచ్చిన అన్ని అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి.
గ్రామ అభివృద్ది ప్రణాళిక అత్యంత కీలకం. పకడ్బందీగా వాటిని రూపొందించాలి. అభివృద్ధి ప్రణాళికల్లో గ్రామసభల్లో సమగ్ర చర్చ.
జన్మభూమిలో సంక్రాంతి సంబరాలు జరపాలి. మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించాలి
ప్రభుత్వ పథకాలు ప్రతిబింబించేలా ముగ్గుల పోటీలు.
పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణం, గ్రామాల్లో వసతులు, చంద్రన్న పెళ్లికానుకలు, ఎన్టీఆర్ భరోసా పించన్లు ముగ్గుల రూపంలో ఆకట్టుకున్నాయి.
… ఇదీ వరస.