అమెరికా ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న చంద్రబాబు

ఆరోగ్య పరీక్షలకని అమెరికా వెళ్ళిన చంద్రబాబునాయుడు బాగానే రిలాక్సవుతున్నట్లు కనిపిస్తోంది. అసెంబ్లీ సమావేశాలను కూడా పక్కన పెట్టేసి భార్య భువనేశ్వరితో కలిసి చంద్రబాబు మిన్నెసొటా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. రెగ్యులర్ గా చేసుకునే వైద్య పరీక్షలకోసమే చంద్రబాబు అమెరికా వెళ్ళారని చెబుతున్నా ఎవరూ నమ్మటం లేదు.

సరే చంద్రబాబు అనారోగ్యాన్ని పక్కనపెట్టేస్తే మిన్నెసొటాలో మాత్రం చంద్రబాబు బాగా ఎంజాయ్ చేస్తున్నట్లే ఉంది. స్ధానికంగా ఉండే కొందరు టిడిపి అభిమానులు, చంద్రబాబు సన్నిహితులు వెంట నడుస్తుండగా అక్కడి రోడ్లపైన చంద్రబాబు తిరిగిన వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. బాగా రద్దీగా ఉండే రోడ్లలో కూడా కొందరిని వెంటేసుకుని చంద్రబాబు షాపింగ్ చేస్తు కనిపించారు.

అదే సమయంలో అక్కడి పాక్ కార్న్ ను తింటూ సన్నిహితులతో మాట్లాడుతున్నపుడు తీసిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో పాపులరయ్యాయి. అక్కడి పోలీసులు సైతం చంద్రబాబుతో దిగిన ఫొటోలను నెటిజన్లు పాపులర్ చేస్తున్నారు.  మొత్తం మీద మొన్న తగిలిన ఓటమి బాధ నుండి చంద్రబాబు బయటపడుతున్నట్లే కనిపిస్తోంది.