మెగా హీరోల పరువు తీస్తున్న నాగబాబు.. అలాంటి స్పందన అవసరమా?

మెగా హీరోలలో ఒకరైన చిరంజీవి రాబోయే నాలుగేళ్లలో వీలైనన్ని ఎక్కువ సినిమాలలో నటించి ఆ సినిమాలతో విజయాలను సొంతం చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నారు. మరో మెగా హీరో పవన్ కళ్యాణ్ వీలైనన్ని సినిమాలలో నటించి ఆ తర్వాత రాజకీయాలలో సత్తా చాటాలని అనుకుంటున్నారు. ఏపీలో జనసేన పార్టీని అధికారంలోకి తీసుకొనిరావాలని పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నారు.

మరో మెగా బ్రదర్ నాగబాబు అటు సినిమాలలో ఇటు రాజకీయాలలో కెరీర్ ను కొనసాగిస్తూ ఉండటం గమనార్హం. అయితే చిరంజీవి, పవన్ కళ్యాణ్ గురించి ఎవరైనా నెగిటివ్ కామెంట్లు చేస్తే చిరంజీవి, పవన్ ఆ కామెంట్ల గురించి స్పందించడానికి ఇష్టపడటం లేదు. అయితే నాగబాబు మాత్రం వెంటనే రియాక్ట్ అవుతున్నారు. అయితే నాగబాబు స్పందన వల్ల చిరంజీవి, పవన్ లకు జరిగే మేలు కంటే నష్టం ఎక్కువ కావడం గమనార్హం.

చిరంజీవి, పవన్ నాగబాబు సోదరులే కావచ్చు అంత మాత్రాన ప్రతి సందర్భంలోనూ వాళ్లపై వచ్చిన ప్రతి నెగిటివ్ కామెంట్ కు నాగబాబు రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు. నాగబాబు కామెంట్ల వల్ల చిన్న విషయం మరింత పెద్దది అవుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చిరంజీవి, పవన్ గొప్పదనం వాళ్లకు ఉందని నాగబాబు రియాక్ట్ అయినా కాకపోయినా వాళ్ల గొప్పదనం పెరగడం లేదా తగ్గడం జరగదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

చిరంజీవి ఈ విషయంలో నాగబాబుకు సూచనలు చేయాల్సి ఉంది. గతంలో కూడా నాగబాబు బాలయ్య ఎవరో తెలియదని చెబుతూ నందమూరి అభిమానుల ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే. నాగబాబు వల్ల మెగా ఫ్యామిలీకి నష్టం కలుగుతోందని అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. నాగబాబు ఇప్పటికైనా కొన్ని విషయాలకు సంబంధించి మారాల్సిన అవసరం అయితే ఉంది.