‘సైకిల్’ని తొక్కేయండి!: టీడీపీపై నాగబాబు (వీడియో)

తెలుగుదేశంపై, బాలయ్యపై వరస పెట్టి సెటైర్స్ వేస్తున్న నాగబాబు ఈ సారి మరో ఫన్నీ వీడియోతో మన ముందుకు వచ్చారు. మొన్నామధ్య ఏబీఎన్ లోకేష్ భజన అంటూ చేసిన వీడియో బాగా వైరల్ అయ్యినట్లే ఈ వీడియోకూడా పాపులర్ అవుతోంది.

తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్ పై మెగాబ్రదర్ నాగబాబు ఈరోజు ఫన్నీ స్కిట్ ను విడుదల చేశారు. మై ఛానల్ నా ఇష్టం ఛానల్ లో ఈరోజు స్పందిస్తూ.. ‘ఆరోగ్యం బాగుండాలంటే సైకిల్ తొక్కాలి. ఆంధ్రప్రదేశ్ బాగుండాలంటే సైకిల్ నే తొక్కాలి.మర్చిపోరు కదా. థ్యాంక్యూ’ అని తెలిపారు. మీరు ఇక్కడ ఆ వీడియోని చూడవచ్చు.

https://www.youtube.com/watch?v=nZQrRy2mSsk&feature=youtu.be

ఆ వీడియో కంటెంట్ లో ఏముందంటే… ఇద్దరు పిల్లలు సైకిల్ తో ఆడుకుంటూ ఉంటారు. ఒకరేమో సైకిల్ తొక్కుతూ రౌండ్లు కొడుతుంటే ఇంకో పిల్లాడేమో సైకిల్ ని కాలుతూ ఆగ్రహంతో తొక్కుతూ ఉంటారు. నాగబాబు వాయిస్ ఓవర్ లో సైకిల్ పై రౌండ్లు వేస్తున్న అబ్బాయిని బాబూ నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగితే ఆరోగ్యం బాగుండాలని సైకిల్ తొక్కుతున్నా అంకుల్ అంటాడు.

ఇంకో అబ్బాయిని అడిగితే ఆంధ్రప్రదేశ్ బాగుండాలని సైకిల్ని తొక్కుతున్నాను అంకుల్ అంటాడు… చూశారా అంటూ నాగబాబు తెరమీదకు వచ్చి మీ ఆరోగ్యం బాగుండాలంటే సైకిల్ తొక్కండి. ఆంధ్ర ప్రదేశ్ బాగుండాలంటే సైకిల్ నే తొక్కండి అంటూ వ్యాఖ్యానించి వెటకారం చేసారు.

అలాగే ఈ వీడియో విషయమై మాట్లాడూతూ ..‘అన్నట్లు ఇందులో చూపిన వాహనం ఏ వ్యక్తికీ సంబంధించింది కాదు. ఓ సైకిల్ కంపెనీకి మేమిచ్చిన యాడ్ ఇది’ అంటూ ముగించారు.