రేవంత్ రెడ్డి ఇంటిపై ఐటి దాడులు: ములుగు సీతక్క ఫైర్

రేవంత్ రెడ్డి పై ఐటి సోదాలు నిర్వహించడంపై ఆయన అభిమానులు, కాంగ్రెస్ నేతల్లో తీవ్ర ఆగ్రహ జ్వాలలు చెలరేగాయి. హైద్రాబాదు జూబ్లీ హిల్స్ లో ఆయన గృహం వద్దకు పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు, అభిమానులు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో మహిళా కాంగ్రెస్ నాయకురాలు ములుగు సీతక్క మీడియాతో మాట్లాడుతూ కెసిఆర్ సర్కార్ పై ఫైర్ అయ్యారు.

పెట్టుబడిదారులకు కట్టబెడుతూ దోచుకున్నది మీరు అంటూ కెసిఆర్ సర్కార్ పై మండిపడ్డారు ములుగు సీతక్క. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఆమె తెలిపారు. రేవంత్ రెడ్డి మీద కుట్ర జరుగుతుందని ఆమె ఆరోపించారు. నోట్ల రద్దు జరిగిన రోజు… నోట్ల రద్దును వ్యతిరేకించి మరుసటి రోజు మోదీ వద్ద మోకరిల్లారు కెసిఆర్. ఆయన దగ్గర ఉన్న డబ్బును మార్పిడి చేసుకున్నట్టు దేశమంతా తెలుసు. ఆయన స్వలాభం కోసం మోదీ దగ్గర ఎన్నిసార్లు మోకరిల్లారో, ఏవిధంగా లబ్ది పొందారో అందరికి తెలుసు. ఇక్కడ నుండి లేఖలు పంపి దాడులు చేయించింది కెసిఆర్ అని నాకు తెలుసు.

మరో ఎంపీ పైన కూడా ఐటి దాడులు జరిపారు. కానీ ఇక్కడ దాడులు జరిపించాలని పథకంతో అక్కడ ముందస్తు సమాచారం ఇచ్చి దాడులు చేసినట్టు మాకు తెలుసు అని అన్నారు. నేను… కెసిఆర్ కూతురు కవిత, కొడుకు కేటీఆర్ ఇక్కడ దోచుకుని అమెరికాలో పెట్టుబడులు పెడుతున్నారు అని అభియోగిస్తున్నా. బతుకమ్మ పేరుతొ బయట ప్రపంచంలో పెట్టుబడులు పెడుతున్నారని నేను అభియోగం చేస్తున్నా మరి ఐటి దాడులు జరిపిస్తారా అని ప్రశ్నించారు.