ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి వీరంగం, వైరల్ అవుతున్న వీడియో

విశాఖపట్టణం జిల్లా పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి చెందిన  ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆమె తన వదినతో గొడవపడిన వీడియో ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది.

గిడ్డి ఈశ్వరి తన స్వగ్రామం కుమ్మరిపుట్టలో తన వదిన విజయలక్ష్మీ వద్ద రెండు లక్షలకు భూమి కొనుగోలు చేశారు. ఆ భూమిలోనే ఎమ్మెల్యే ఇంటి నిర్మాణ పనులు చేపడుతుంది. అయితే  గది నిర్మాణానికి సంబంధించి ఈశ్వరికి, ఆమె వదిన విజయలక్ష్మీకి వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఒకరిపై ఒకరు తోసుకుంటూ కిందపడిపోయారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ గా మారింది. మీరు చూడండి ఏం జరిగిందో వీడియో..