మంత్రి కొడాలి ‘తాలింపు సెగ’ టీడీపీకా.? వైసీపీకా.?

Minister Kodali
Minister Kodali
Minister Kodali

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడి మీద విమర్శలు చేయాలంటే, బూతులు లంకించుకోవడం మంత్రి కొడాలి నానికి అలవాటే. ‘చంద్రబాబుని విమర్శించడానికి వైసీపీలో ఓ బూతు మంత్రి వున్నారు.. కేవలం బూతుల కోసం అతన్ని మంత్రిగా చేశారు..’ అని టీడీపీ విమర్శించడం చూస్తూనే వున్నాం. అందులో నిజం ఎంత.? అన్న విషయాన్ని పక్కన పెడితే, ఆ విమర్శకు పూర్తిస్థాయిలో న్యాయం చేసేస్తున్నారు మంత్రి కొడాలి నాని. నోరు ఎవరికైనా ఒకటే. బూతులు తిట్టడానికి ‘సంస్కారం’ కొందరికి అడ్డు వస్తుందంతే. ఆ విషయాన్ని కొడాలి నాని విస్మరిస్తున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. చంద్రబాబు వ్యభిచార గృహాలు నడిపారంటూ మంత్రి కొడాలి నాని చేసిన విమర్శల మీద టీడీపీ నేత, సినీ నటి దివ్యవాణి స్పందించారు. ‘చంద్రబాబు వ్యభిచార గృహాల్ని నడిపితే, నువ్వు అమ్మాయిల్ని సప్లయ్ చేశావా.?’ అని కొడాలిపై ఎదురుదాడికి దిగారు దివ్య వాణి. సరే, ఈ రాజకీయ విమర్శల్ని అదుపు చేయడం అనేది ఎవరి తరమూ కాదు. ఆ స్థాయికి రాష్ట్ర రాజకీయాలు దిగజారిపోయాయి. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు అదుపు కోల్పోయి మాట్లాడుతన్నారు. ‘ఏం పీకావ్..’ అని ముఖ్యమంత్రిపై విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో అధికార పక్షం నుంచి మరింత దారుణమైన తిట్లు, బూతులు దూసుకొస్తున్నాయి. కాగా, ఈ రాజకీయ విమర్శల పర్వం నూటికి నూరు పాళ్ళూ అధికార పక్షంపై ప్రజల్లో చులకన భావం ఏర్పడటానికి దారి తీస్తుందనే అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. విపక్షాల్లో వున్నవారు నోటిని అదుపులో పెట్టుకోకపోతే అదొక లెక్క. కానీ, ముంత్రి తన మాట మీద అదుపు కోల్పోతే ఖచ్చితంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది.

కొడాలి నాని బూతుల వ్యవహారం వైసీపీని జనంలో పలచన చేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎందుకు కొడాలి నానిని అదుపు చేయలేకపోతున్నారన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. ‘ముఖ్యమంత్రి అదుపు చేయకపోవడమంటే.. ఆయనే ప్రోత్సహిస్తున్నారనుకోవాలి..’ అన్న వాదన రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది.