అమిత్ షా – కేఏ పాల్ భేటీ: ఏం జరుగుతోంది చెప్మా.?

KA Paul

KA Paul : ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, క్రైస్తవ మత ప్రచారకర్త శాంతి దూతగా చెప్పుకునే కిలారి ఆనంద్ పాల్ అలియాస్ కేఏ పాల్, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా‌తో ఢిల్లీలో భేటీ అవడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. శతృవుకి శతృవు మిత్రుడన్నట్టు, తెలంగాణలో ఇటీవల టీఆర్ఎస్ కార్యకర్త చేతిలో చెంప దెబ్బ తిన్న పాల్, అమిత్ షా వద్దకు వెళ్ళడం ఆసక్తికరమే మరి.

బీజేపీ – ప్రజాశాంతి పార్టీల మధ్య రాజకీయ పొత్తు ఏర్పడుతుందా.? అంటే, ఓ భారత పౌరుడిగా ఆయన కేంద్ర మంత్రిని కలిశారు తప్ప, ఇందులో రాజకీయమేమీ లేదన్నది ప్రజా శాంతి పార్టీ వర్గాల (?!) భావన.

చాలా చాలా చిత్రమైన కాంబినేషన్ ఇది రాజకీయాల్లో. వచ్చే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుందట. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఒకే ఒక్క హైద్రాబాద్ స్థానాన్ని తప్ప, అన్ని లోక్ సభ స్థానాల్నీ ప్రజాశాంతి పార్టీ గెలుచుకుంటుందట.. అలాగని సెలవిచ్చారు పాల్.

ఇంకెందుకు, ఏపీ అలాగే తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికలు పెట్టకుండా పాల్ పార్టీనే విజయం సాధించినట్లు ప్రకటించేస్తే పోలా.? పాల్ చేసిన మరో ఇంట్రెస్టింగ్ కామెంట్ ఏంటంటే, పవన్ కళ్యాణే బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు తప్ప, బీజేపీ మాత్రం పవన్ కళ్యాణ్ వెంట పడటంలేదట.. అలాగని అమిత్ షా చెప్పారట.

వినేవాడుంటే కేఏ పాల్ ఎన్ని మాటలైనా చెబుతారు. ఆయన పనే అది. కానీ, ఏమాటకామాటే చెప్పుకోవాలి.. ముఖ్యమంత్రులకు సైతం కనాకష్టంగా మారే కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కేఏ పాల్ ఎలా సంపాదించగలిగారబ్బా.?