జగన్ పై దాడి ఘటనలో పలు వివాదాలు చెలరేగుతున్నాయి. ఈ దాడిలో అధికార పక్షానికి భాగస్వామ్యం ఉందని వైసీపీ శ్రేణులు ఆగ్రహిస్తుంటే, సింపతీ కోసం వైసీపీ కార్యకర్తలే చేసారంటూ వాదోపవాదాలు చేసుకుంటున్నారు ఇరు వర్గాలు. ఈ నేపథ్యంలో లోకేష్ చేసిన ట్వీట్స్ సంచలనంగా మారాయి. ఆయన చేస్తున్న వరుస ట్వీట్లు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
వైకాపా కోడి కట్టి డ్రామా! అధికారం కోసం అడ్డదారులు తొక్కడం జగన్ మోడీ రెడ్డికి కొత్త కాదు. మరో సారి ఓటమి తప్పదు అనే భయంతో కోడి కత్తి డ్రామాకి తెరలేపారు. దాడి వెనుక ఉన్న వైకాపా కుట్ర ప్రజలకు అర్ధమయ్యింది. ఇంకా ప్రజలను మభ్య పెట్టాలని వైకాపా నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారు. కాగా జగన్ పేరును మోడీ పేరుతో కలిపి కావాలనే లోకేష్ అలా రాసినట్టు అర్థమవుతున్నది. దీనికి సంబంధించిన ట్వీట్ లింక్ కింద ఉంది చూడండి.
వైకాపా కోడి కత్తి డ్రామా! అధికారం కోసం అడ్డదారులు తొక్కడం జగన్ మోడీ రెడ్డి కి కొత్త కాదు. మరో సారి ఓటమి తప్పదు అనే భయంతో కోడి కత్తి డ్రామా కి తెరలేపారు. దాడి వెనుక ఉన్న వైకాపా కుట్ర ప్రజలకు అర్థం అయ్యింది.ఇంకా ప్రజలను మభ్య పెట్టాలి అని వైకాపా నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారు.
— Lokesh Nara (@naralokesh) October 26, 2018
తండ్రి చితికి నిప్పు పెట్టకముందే ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసిన వ్యక్తి ఇలాంటి కత్తి డ్రామా చేయడంలో ఆశ్చర్యం లేదు. ఎన్ని కుయుక్తులు పన్నినా ఆఖరిగా ప్రజల ముందు గెలిచేది నిజం మాత్రమే. #జగన్నాటకం. దీనికి సంబంధించిన ట్వీట్ లింక్ కింద ఉంది చూడండి.
తండ్రి చితికి నిప్పు పెట్టకముందే ముఖ్యమంత్రి పీఠం పై కన్నేసిన వ్యక్తి ఇలాంటి కత్తి డ్రామా చెయ్యడంలో ఆశ్చరం లేదు.ఎన్ని కుయుక్తులు పన్నినా ఆఖరిగా ప్రజల ముందు గెలిచేది నిజం మాత్రమే. #Jagannatakam
— Lokesh Nara (@naralokesh) October 26, 2018
ఇటు ఫిన్ టెక్ కార్యక్రమాన్ని భగ్నం చెయ్యడం, అటు ప్రజల సానుభూతిని పొందడం -ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనుకున్నాడు జగన్. కానీ ఏ ప్రతిష్టాత్మక కార్యక్రమం జరుగుతున్నా అదే సమయంలో ఏదో ఒక అలజడి సృష్టించడం వరుసగా చూస్తూ వస్తున్నదే కాబట్టి జగన్ నాటకానికి ఏ ప్రయోజనం దక్కలేదు. #జగన్నాటకం. దీనికి సంబంధించిన ట్వీట్ లింక్ కింద ఉంది చూడండి.
ఇటు ఫిన్ టెక్ కార్యక్రమాన్ని భగ్నం చేయడం, అటు ప్రజల సానుభూతిని పొందడం – ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనుకున్నాడు జగన్. కానీ ఏ ప్రతిష్టాత్మక కార్యక్రమం జరుగుతున్నా అదే సమయంలో ఏదో ఒక అలజడి సృష్టించడం వరుసగా చూస్తూ వస్తున్నదే కాబట్టి జగన్ నాటకానికి ఏ ప్రయోజనమూ దక్కలేదు. #Jagannatakam
— Lokesh Nara (@naralokesh) October 26, 2018
లోకేష్ చేసిన ఈ ట్వీట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నెటిజన్లు పలు కామెంట్స్, రీట్వీట్స్ చేస్తున్నారు. జగన్ అభిమానులు లోకేష్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే టీడీపీ అభిమానులు మాత్రం లోకేష్ మాటలకి మద్దతు ఇస్తున్నారు.