లోకేష్ అడ్డంగా దొరికిపోయాడు: ఇదిగో “వీడియో” సాక్ష్యం

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తనయుడు, ఐటీ మినిస్టర్ లోకేష్ అడ్డంగా దొరికిపోయారు. తరచు ఏదొక పొరపాటు చేస్తూ సోషల్ మీడియాలో నవ్వుల పాలవుతుంటారు లోకేష్. ఆయన పొరపాటుగా మాట్లాడి దొరికిపోయిన ప్రతిసారి సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటారు. ఇక ప్రతిపక్షాల విమర్శల సంగతి చెప్పనక్కర్లేదు. ట్రోల్ల్స్ మీద ట్రోల్ల్స్ చేసేస్తుంటారు.

లోకేష్ కి తెలుగు సరిగా రాకపోవడం వలన ఈ తప్పులు దొర్లుతున్నాయని తెలుగు టీచర్ ని కూడా పెట్టారు. సరే తెలుగు చక్కగానే మాట్లాడుతున్నాడు. చిన్నబాబు దూకుడు పెంచాడు అని అందరు అనుకుంటుండగా…లోకేష్ లెక్కలు తప్పు చెప్పి దొరికిపోయాడు. ఒక సభలో మాట్లాడుతూ సీఎం సాధించిన ఘనతను చెప్పబోయాడు. అదేమిటయ్యా అంటే…

‘చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన నాటికి భారత దేశంలో “100” ఫోన్లు తయారైతే ఆంధ్ర రాష్ట్రంలో తయారయ్యే ఫోన్లు “0”. అలాంటిది నాలుగు సంవత్సరాల్లో భారత దేశంలో “100” ఫోన్లు తయారైతే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో “260 ” ఫోన్లు తయారవుతున్నాయి’ అని చెప్పారు. ఇప్పుడు ఎన్టీవీ కి సంబంధిన ఆ వీడియో నెట్ లో తెగ హల్ చల్ చేస్తోంది. ఇక వైసిపి శ్రేణులు ఈ వీడియోని విపరీతంగా షేర్ చేసుకుంటున్నారు.

సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజెన్లు విపరీతంగా షేర్లు, కామెంట్స్ చేస్తున్నారు. ఇండియా మొత్తంలో “100” ఫోన్లు తయారైతే “260” ఫోన్లు రాష్ట్రంలో తయారవుతాయి అనటంలో ఈక్వేషన్ కరెక్ట్ గా లేదంటూ ట్రోల్ల్స్ చేస్తున్నారు నెటిజెన్లు. దీనికి సంబంధించిన వీడియో కింద ఉంది చూడండి.

నిజానికి ఆయన “1000” అనబోయి “100” అన్నారట. లోకేష్ తన ప్రసంగాల్లో చేస్తున్న ఈ పొరపాట్ల వలన అవమానంతో చంద్రబాబు తల పట్టుకుని కూర్చుంటున్నారట. అసలే తన కొడుకుని సీఎం గా చేయాలి అనుకుంటున్న నేపథ్యంలో లోకేష్ ఇలా చేస్తుంటే ఆయనకు తలవంపులే కదా మరి.