రుణాలు ఎగవేసి బ్రిటన్ పారిపోయిన దర్జా దొర లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు ఇంకా కష్టకాలం వెంటాడుతూనే ఉంది. ఒకప్పుడు దేశంలో లిక్కర్ సామ్రాజ్యాన్ని ఒంటి చేత్తో శాసించిన ఆయన గుట్టు చప్పుడు కాకుండా బ్యాంకులకు రుణాలు ఎగవేసిన కేసులో బ్రిటన్ పారిపోయిన కేసులో లండన్‌లో తలదాచుకున్నాడు. ఓ ఫ్రెంచి దీవిలో మాల్యా కొనుగోలు చేసిన అత్యంత విలాస వంతమైన భవనం కూడా ఇప్పుడు అమ్మకానికి వచ్చింది. ఫ్రాన్స్‌కు చెందిన ఇలీ సెయింటీ దీవిలో ఉన్న లీ గ్రాండ్ జార్డెన్ అనే భవంతిని మాల్యా 12 ఏళ్ల క్రితం కొనుగోలు చేశాడు. ఈ భవనం కొనడానికి గిజ్మో ఇన్వెస్ట్ పేరితో ఖతార్ నేషనల్ బ్యాంక్ అన్స్ బాచర్ అండ్ కో యూనిట్ నుంచి 30 మిలియన్ డాలర్ల రుణం తీసుకున్నాడు. దాని కోసం ఇంగ్లాండ్‌లో ఉన్న లగ్జరీ బోటును ష్యూరిటీ పెట్టాడు.
కాలక్రమంలో ఎన్నో పరిణామాలు.. అప్పుల్లో మునిగి మాల్యా దివాలా తీశాడు. రుణ కాలపరిమితి పెంచాలని బ్యాంకును కోరాడు. మాల్యా పరిస్థితిని అంచనా కోసం ఖతర్ బ్యాంక్ వర్గాలు భవంతిని తనిఖీ చేశాయి. అప్పటికే ఆ భవనం శిథిలావస్థకు చేరుతుండటంత బ్యాంకు మాల్యాపై దావా వేసింది. మాల్యా లగ్జరీ బోటును అమ్మేందుకు ఆదేశాలివ్వాలని కోర్టును కోరింది. అప్పటికీ రుణం తీరే మార్గం లేక పవడంతో ఆ భవనాన్ని అమ్మకానికి పెడుతున్నట్లు పేర్కొంది. ఈ భవనంలో 17 బెడ్ రూమ్‌లు, ఓ సినిమా థియేటర్, నైట్ క్లబ్, హెలీప్యాడ్ ఉన్నాయి.