టిడిపికి షాక్ తగిలింది. విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం నుంచి జనార్ధన థాట్రాజుకు టిడిపి టికెట్టు లభించింది. దీంతో థాట్రాజు నామినేషన్ వేశారు. అయితే థాట్రాజు కుల ధృవీకరణ పత్రంలో తేడాలుండడంతో అధికారులు నామినేషన్ ను తిరస్కరించారు. థాట్రాజుకు డమ్మీగా నామినేషన్ వేసిన అతని తల్లి నరసింహ ప్రియ నామినేషన్ ను అధికారులు ఆమోదించారు. దీంతో నరసింహ ప్రియ బరిలో ఉండనున్నారు. నరసింహ ప్రియ తమ అభ్యర్ధిని టిడిపి ప్రకటించింది.