చంద్రబాబునాయుడు మానసిక పరిస్ధితికి ఏమైంది ? ఎందుకు చంద్రబాబు మానసిక పరిస్ధితిని అనుమానిస్తున్నారు. బిజిపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాటలు చూస్తుంటే అందరిలోను అవే అనుమానాలు మొదలయ్యాయి. చంద్రబాబు మానసిక పరిస్ధితి బాగాలేదని కన్నా అంటున్నారు. త్వరలోనే చంద్రబాబు బట్టలూడదీసుకుని రోడ్లపై తిరిగినా ఆశ్చర్యం లేదని కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఎందుకు కన్నా అలాగంటున్నారంటే, రాష్ట్రానికి ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీతోనే చంద్రబాబు జతకట్టటం చూసిన తర్వత తనకు అనుమానం వచ్చిందన్నారు. టిడిపి, కాంగ్రెస్ పొత్తులపై చంద్రబాబు జనాలకు సమాధానాలు చెప్పాలని కూడా కన్నా డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు సైంధవుడులాగ తయారైనట్లు కన్నా మండిపడ్డారు. అసలు రాష్ట్ర విభజన సమయంలోనే చంద్రబాబు, కాంగ్రెస్ మధ్య రహస్య ఒప్పందాలేమన్నా జరిగిందా అన్న అనుమానాన్ని కూడా కన్నా వ్యక్తం చేస్తున్నారు.
ఇపుడు కన్నా వ్యక్తం చేసిన అనుమానాలను గతంలో కాస్త అటు ఇటుగా కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు కూడా అనుమానం వ్యక్తం చేయటం అందరికీ గుర్తుండే ఉంటుంది. కాకపోతే చంద్రబాబుకు అల్జిమర్స్ చివరదశకు చేరుకుందని కెవిపి అన్నారు. అల్జిమర్స్ అంటే మతిమరుపు రోగం. చెప్పిందే చెప్పటం, చేసిందే చేయటం, తాను చేసిన పనులేవీ తాను చేయలేదని చెబుతున్న చంద్రబాబును చూస్తే అల్జిమర్స్ ముదిరిపోయిందనే అనుమానం తనకు వస్తోందన్నారు. మొత్తానికి అంతా కలిసి చంద్రబాబును మానసిక రోగిని చేసేట్లే ఉన్నారు.