‘జబర్దస్త్’ రాకింగ్ రాకేష్ ..డోర్నకల్ లో ఏం చేసాడో తెలుసా!?

తెలంగాణాలో ఎలక్షన్స్ ప్రచార వేడి పతాక స్దాయికి చేరింది. ఎవరికి వారు తమదైన శైలిలో జనాలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకోసం డబ్బులు, బ్యాండ్ లు, మైక్ లు, పాటలతో రోడ్ షోలతో ప్రచారం చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారు. తాజాగా డోర్నకల్‌ పట్టణంలో సోమవారం జబర్దస్త్‌ కమిడియన్స్ సాయింతో ప్రచారం చేసారు. జనాలని ఈ కమిడియన్స్ ఆకట్టుకునే ప్రయత్నం చేసారు.

జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన హాస్యనటులు రాకింగ్‌ రాకేష్, ఫణి పట్టణంలోని పలు వీధులలో రోడ్‌షో నిర్వహించారు. బీఎస్‌పీ అభ్యర్థి శ్రీనునాయక్‌ను గెలిపించాలని కోరుతూ పట్టణంలో రోడ్‌షో నిర్వహించారు. రోడ్‌షోలో పాల్గొన్న రాకేష్, ఫణి మాట్లాడుతూ విద్యావంతుడు, ఉన్నత ఉద్యోగం చేస్తున్న శ్రీనునాయక్‌ను డోర్నకల్‌ ఎమ్మెల్యే గెలిపించి ఆదరించాలని కోరారు.

శ్రీనునాయక్‌తో తమకు ఉన్న పరిచయంతో డోర్నకల్‌ నియోజకవర్గంలో ఆయనను గెలిపించాలని కోరుతూ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నామని తెలిపారు. బీఎస్‌పీ అభ్యర్థి శ్రీనునాయక్‌ మాట్లాడుతూ స్థానికుడినైన తనను డోర్నకల్‌ ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఎస్‌పీ జిల్లా అధ్యక్షులు దార్ల శివరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.