ఈసారి పవన్ కళ్యాణ్ మాత్రమే.! చంద్రబాబు కానే కాదట.!

pawan kalyan

పొత్తు ఖరారైపోయిందంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు సోషల్ మీడియాలో హంగామా మొదలెట్టేశాయ్. జనసేనతో చంద్రబాబు డీల్ సెట్ చేశారన్నది తెలుగు తమ్ముళ్ళు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నమాట. ‘అవసరమైతే జనసేన పార్టీకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తాం..’ అంటూ తెలుగు తమ్మళ్ళు చెప్పేస్తున్నారండోయ్.. అది కూడా ఆఫ్ ది రికార్డుగా మాత్రమే. మరీ తప్పనిసరి పరిస్థితి అయితే, ఓ ఏడాదిన్నర కాలం పాటు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా వుండేందుకు అనుగుణంగా జనసేన పార్టీతో ఒప్పందం కుదుర్చుకునే అవకాశాలున్నాయని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మిగిలిన కాలం మాత్రం చంద్రబాబే ముఖ్యమంత్రి అట.

ఆలూ లేదు.. చూలూ లేదు.. అప్పుడే ముఖ్యమంత్రి కుర్చీ గురించి పంపకాలా.? అంటే, రాజకీయాలు అలాగే వుంటాయ్. వున్నపళంగా చంద్రబాబు పరిగెత్తుకుంటూ పవన్ కళ్యాణ్‌తో ఎందుకు భేటీ అయినట్టు.! ఈ భేటీ వెనుక బలమైన కారణమే వుంది.. ఈ వేడిలోనే, పవన్ కళ్యాణ్‌ని ఒప్పించేయాలన్నది కీలకమైన విషయమిక్కడ.

ఇంతకీ పవన్ – చంద్రబాబు మధ్య నలభై నిమిషాలపాటు ఏం చర్చలు జరిగినట్లు.? ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయాలు, పొత్తుల వ్యవహారాల గురించిన చర్చే వస్తుంటుంది. చంద్రబాబు ఎలాగూ పవన్ కళ్యాణ్‌కి పాత మిత్రుడే. 2014 ఎన్నికల్లో టీడీపీ గెలిచి, చంద్రబాబు ముఖ్యమంత్రి అవడం.. అందులో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించడం తెలిసిన విషయమే.

‘జనసేన, బీజేపీతో కలవడం వల్ల కొంత నష్టపోయాం..’ అని ఆ తర్వాత టీడీపీ మాట మార్చిందనుకోండి.. అది వేరే సంగతి. ఈసారి అలాంటి వివాదాలకు తావు లేకుండా.. పంపకాల గురించిన చర్చలు ముందే ప్రారంభమయ్యాయట. అయితే, ‘మేం అధికారంలో వుంటాం.. మీరు అడ్డు చెప్పొద్దు.. కావాలంటే ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకోండి..’ అని జనసేన తేల్చేసిందట టీడీపీకి. దానికి సైతం చంద్రబాబు ‘ఓకే’ చెప్పక తప్పని పరిస్థితి వుంది.