చంద్రబాబుకు అనారోగ్యమా ?

Chandra Babu Naidu is struggling as an Opposition leader

చంద్రబాబునాయుడు అమెరికా వెళ్ళబోతున్నారు. ఆదివారం హైదరాబాద్ నుండి బయలుదేరి అమెరికా వెళుతున్నారు. అరోగ్య పరీక్షలు చేయించుకునేందుకు వెళుతున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. చంద్రబాబు అమెరికా పర్యటన విషయం ఒక్కసారిగా వెలుగు చూడటంతో పార్టీ నేతలే ఆశ్చర్యపోయారు.

అమెరికాకు వెళటానికి చంద్రబాబు ఎప్పుడో ప్లాన్ చేసుకుని ఉండచ్చు. కానీ ఆ విషయాన్ని సహజంగానే చాలా గోప్యంగా ఉంచారు. శుక్రవారం విజయవాడ నుండి హైదరాబాద్ వెళతారని అక్కడి నుండి అమెరికాకు వెళతారని శుక్రవారం మీడియా సమావేశం సందర్భంగా బయటపడేసరికి అందరూ నివ్వెరపోయారు.

పార్టీ వర్గాల ప్రకారం ఆరోగ్య పరీక్షల నిమ్మితం చంద్రబాబు తరచూ అమెరికాకు వెళతారట. అయితే ఆమాత్రం చంద్రబాబుకు పరీక్షలు చేయటానికి హైదరాబాద్ లో లేకపోతే ఇండియాలో ఆసుపత్రులే లేవా ? అన్నదే సందేహం. మొన్నటి మొన్న అంటే 15 రోజుల క్రితం హైదరాబాద్ కు వచ్చి ఏషియన్  గ్యాస్ట్రో ఎంటరాలజీ సెంటర్లోనే వైద్య పరీక్షలన్నీ చేయించుకున్నారు. ఈ పరీక్షల నిమ్మితం చంద్రబాబు రెండు రోజులు హైదరాబాద్ లోనే ఉన్న విషయం గుర్తుండే ఉంటుంది.

అంతకుమందు కేర్ ఆసుపత్రికి కూడా ఒకసారి వెళ్ళారు. అంటే రొటీన్ గా జరిగే ఆరోగ్య పరీక్షలన్నింటినీ చంద్రబాబు హైదరాబాద్లోనే చేయించుకుంటున్నపుడు మళ్ళీ ఇపుడు అదే కారణంతో అమెరికాకు వెళ్ళటంపైనే అందరిలోను అనుమానాలు మొదలయ్యాయి.