ఆ మాటలతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను.. సమంత షాకింగ్ కామెంట్స్?

దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్న సమంత ప్రస్తుతం తన భర్తకు విడాకులు ఇచ్చి ఒంటరిగా తన జీవితాన్ని ముందుకు నెట్టుకు వస్తున్నారు. ఇలా సమంత కెరియర్ పరంగా ఎంతో అద్భుతమైన విజయాలను అందుకున్నప్పటికీ వృత్తిపరమైన జీవితంలో మాత్రం ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది. ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తతో విడాకులు తీసుకుని దూరమైన సమంత ఆ బాధతో కొన్ని రోజులపాటు ఎంతో కుమిలిపోయింది.ఈ క్రమంలోనే ఆ బాధ నుంచి బయట పడిన ఈమె ప్రస్తుతం తన కెరియర్ పై దృష్టి పెట్టి వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.

ఈ విధంగా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న సమంత సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. అయితే సోషల్ మీడియా వేదికగా తన మనసులో ఉన్న భావాలను పోస్టుల రూపంలో బయటపెడుతూ ఎంతోమంది అభిమానులతో తన బాధను పంచుకుంటున్నారు. ఇకపోతే విడాకుల సమయంలో సమంత గురించి ఎన్నో రకాల కామెంట్ లు, ట్రోలింగ్ వచ్చాయి.విడాకులకు కేవలం సమంత వ్యవహారశైలి మాత్రమే కారణమని ఎంతోమంది కామెంట్లు చేశారు.

ఇకపోతే ఇలా సమంత వ్యక్తిత్వం గురించి నెగిటివ్ కామెంట్లు చేయడంతో ఆ మాటలు తనను ఎంతగానో బాధపెట్టాయని, ఆ బాధతో ఎన్నో నిద్రలేని రాత్రులు కూడా గడిపానని సమంత తెలిపారు.అయితే ప్రస్తుతం అలాంటివి అలవాటు అయిందని అందుకే తాను నెగిటివ్ కామెంట్లు గురించి పెద్దగా పట్టించుకోవడం లేదని తెలిపారు. ఇకపోతే తను నిజంగా అభిమానించే అభిమానుల నుంచి సద్విమర్శలను పరిగణలోకి తీసుకుని వాటికి అనుగుణంగా తనలో మార్పులు చేసుకుంటున్నారని సమంత వెల్లడించారు. ప్రస్తుతం ఈమె యశోద ఖుషి సినిమా షూటింగులతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.