తెలంగాణలో నేటి నుంచి వారం రోజుల పాటు సంక్రాంతి సెలవులు

తెలంగాణలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు నేటి నుంచి జనవరి 17 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. జనవరి 18 వ తేదిన తిరిగి స్కూళ్లు, కాలేజిలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే విద్యాశాఖ డిఈవో, ఆర్జేడిలకు ఆదేశాలు జారీ చేసింది. క్రిస్మస్ సెలవులు ఇచ్చిన మిషనరీ స్కూళ్లకు, కాలేజిలకు సంక్రాంతి సెలవుల్లో మినహాయింపునిచ్చారు. వారు సంక్రాంతి రోజు సెలవు దినాన్ని పాటించాలని ఆదేశించారు. జూనియర్ కాలేజిలు జనవరి 16 వ తేదిన ప్రారంభం కానున్నాయి. 

జనవరి 11 నుంచి 17 వరకు మొత్తం ఏడు రోజులు తెలంగాణలో విద్యాశాఖ సెలవులను ప్రకటించింది. సెలవు దినాల్లో క్లాసులు నిర్వహించే ప్రైవేటు కాలేజిలు, స్కూళ్ల పై కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ హెచ్చరించింది. ఎక్కడైన తరగతులు నిర్వహిస్తున్నారన్న సమాచారం తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు. జనవరి