రైల్వేలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వాళ్లకు రైల్వే శాఖ అదిరిపోయే తీపికబురు అందించింది. 7784 టీటీఈ పోస్టులతో పాటు ఇతర ఉద్యోగ ఖాళీలకు సంబంధించి కూడా త్వరలో జాబ్ నోటిఫికేషన్ విడుదల కానుందని సమాచారం అందుతోంది. రాబోయే రోజుల్లో రైల్వేలో ఏకంగా 1,52,00 ఉద్యోగ ఖాళీల కోసం దశల వారీగా నోటిఫికేషన్లు అయితే విడుదల కానున్నాయని సమాచారం అందుతోంది.
దేశంలోని అన్ని రైల్వే జోన్లలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని తెలుస్తోంది. 16 జోన్లలో టీటీటీ శాలరీ కనిష్టంగా 36000 రూపాయల నుంచి గరిష్టంగా లక్షల్లో ఉండనుంది. పది, ఇంటర్, డిగ్రీ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, మాజీ సైనికులకు దరఖాస్తు ఫీజు 250 రూపాయలుగా ఉండగా మిగిలిన వాళ్లకు మాత్రం దరఖాస్తు ఫీజు 500 రూపాయలుగా ఉంది.
18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. రూల్స్ ప్రకారం వయోపరిమితిలో సడలింపులు ఉంటాయని సమాచారం అందుతోంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది. రైల్వే ఉద్యోగ ఖాళీల కొరకు ఎదురుచూస్తున్న వాళ్లకు ఇది తీపికబురు అనే చెప్పాలి.
రైల్వే ఉద్యోగాల కొరకు సన్నద్ధం అయ్యేవాళ్లు మరింత బాగా ప్రిపేర్ అయితే సులభంగానే ఉద్యోగాలకు ఎంపికయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. రైల్వే ఉద్యోగ ఖాళీలు భవిష్యత్తుకు ఎంతగానో ప్రయోజకరంగా ఉంటాయని చెప్పవచ్చు.