లీక్స్ యందు “వంశీ లీక్స్” వేరయా?

ప్రపంచాన్ని కుదిపేసే “వికీ లీక్స్”, లక్షల మంది ప్రముఖుల గోప్యపు ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన “పండోరా పేపర్స్‌-2021” స్కాండల్‌. కోలీవుడ్‌ ను ఒక ఊపు ఊపేసిన అత్యంత వివాదాస్పద అంశం “సుచీ లీక్స్‌”, ఆజగా “హిండెన్‌ బర్గ్ లీక్స్” గురించి చాలా మందికి తెలిసిన విషయమే. అయితే తాజాగా ఏపీ రాజకీయాల్లో కూడా ఈ “లీక్” వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది!

అవును… తాజాగా ఏపీ రాజకీయాల్లో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా కొన్ని లీక్స్ ఇస్తున్నారు. వాటిని పూర్తిగా బయటపెట్టకపోయినా.. ప్రత్యర్ధులను బెదిరించే స్థాయిలో హింట్స్ ఇచ్చి వదులుతున్నారు! ప్రస్తుతం ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో వంశీ ఇస్తున్న ఈ లీకులే హాట్ టాపిక్ గా మారాయి.

ఇంతకముందెన్నడూ విననివి.. గతంలో ఎవరూ చెప్పనివి.. ఉన్నఫలంగా వంశీ నుంచి వెలువడుతుంటే.. వాటిలోని వాస్తవాస్తవాలపై పొలిటికల్ సర్కిల్స్ తో పాటు సామాన్య ప్రజానికంలో కూడా తీవ్ర చర్చ జరుగుతుంది!

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అయిన అచ్చెన్నాయుడు.. గతంలో ఓ మహిళా అధికారిపై అసభ్యంగా ప్రవర్తించారని.. ఫలితంగా చంద్రబాబు కాళ్లు పట్టుకున్నారని వంశీ వ్యాఖ్యానించారు. తన గురించి అచ్చెన్నాయుడు మాట్లాడితే.. తాను అందరి చిట్టా విప్పుతానని చెప్పారు!

అక్కడితో ఆగని వంశీ… తాజాగా చంద్రబాబుపైనా ఒక లీక్ ఇచ్చే ప్రయత్నం చేశారు. తనను పశువుల డాక్టర్ అంటూ వెటకారంగా చంద్రబాబు మాట్లాడుతున్నారు… చంద్రబాబు మరోసారి ఇలాగే త‌న‌పై ఎక్కువ మాట్లాడితే.. తిరుప‌తిలో చంద్రబాబు “శిశువుల డాక్టర్”ని మోస‌గించిన క‌థ చెప్పాల్సి వుంటుంద‌ని వంశీ బాంబు పేల్చారు!

దీంతో… వంశీ చెబుతున్న ఆ అధికారి ఎవరు.. ఏమిటా కథ.. కాళ్లు పట్టుకునే స్థాయి వ్యవహారం అప్పట్లో అచ్చెన్న – చంద్రబాబు – మధ్య జరిగిందా? ఎవరు ఆ శిశువుల డాక్టర్.. వారికీ బాబుకీ ఉన్న సంబంధం ఏమిటి.. బాబు ఆ డాక్టర్ ని చేసిన మోసం ఏమిటి? అంటూ డిస్కషన్స్ నడుస్తున్నాయి!

దీంతో… రెగ్యులర్ గా రాజకీయాలు ఫాలో అయ్యేవారికి.. వంశీ ఆరోపణలు కేవలం రాజకీయ ఆరోపణల్లా అనిపించడం లేదని అంటున్నారు విశ్లేషకులు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… అటు అచ్చెన్నాయుడిపైనా, ఇటు చంద్రబాబుపైనా వంశీ ఈ స్థాయిలో లీకుల కామెంట్స్ చేసినా… వాటికి కి కౌంటర్ కానీ, ఖండన కానీ.. టీడీపీ నేతల నుంచి రాకపోవడం!