ఈ నెల 22 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 22న ఉదయం 11.30 నిమిషాలకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. 23 న బడ్జెట్ పై చర్చ జరుగుతుంది. 24 న సెలవు. 25 న కూడా చర్చ జరిగిన తర్వాత శాసన సభ నిరవధిక వాయిదా పడనుంది. అయితే బడ్జెట్ ను ఎవరు ప్రవేశ పెడుతారు అనే దాని పై ఇంకా స్పష్టత లేదు. సీఎం కేసీఆర్, హోం మంత్రిగా మహమూద్ అలీ మాత్రమే ఉన్నారు. ఆర్ధిక మంత్రి లేక పోవడంతో వీరిద్దరిలో ఎవరో ఒకరు బడ్టెట్ ను ప్రవేశ పెట్టే  అవకాశం ఉంది . సీఎం కేసీఆరే బడ్జెట్ ను ప్రవేశ పెడుతారని చర్చ జరుగుతోంది.