సినిమాల్లో సంచలన విజయాలను సొంతం చేసుకున్న మెగాస్టార్ చిరంజీవికి రాజకీయాలు మాత్రం కలిసిరావడం లేదు. తొలి ప్రయత్నంలోనే 2009 ఎన్నికల్లో సీఎం అవుతానని చిరంజీవి భావించగా ఆయన ఆశలు అడియాశలయ్యాయి. 2009 ఎన్నికల్లో మంచి ఫలితాలే వచ్చినా ఆయన ఊహించిన రేంజ్ లో ఫలితాలు రాకపోవడం ఆయనను నిరాశకు గురి చేసింది. ఈ కారణం వల్లే ఆయన రాజకీయాలకు దూరం కావాల్సి వచ్చింది.
ఆ తర్వాత కాలంలో చిరంజీవి రాజకీయాలతో డైరెక్ట్ గా కాకుండా ఇన్ డైరెక్ట్ గా సంబంధాలను కొనసాగిస్తూ వచ్చారు. కొన్నిరోజుల క్రితం చిరంజీవి జనసేనకు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాను రాజకీయాల్లో ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోయినా తమ్ముడు రాజకీయాల్లో సక్సెస్ కావాలని చిరంజీవి కోరుకున్నారు. వైసీపీతో స్నేహపూర్వకంగానే మెలిగిన చిరంజీవి టీడీపీపై మాత్రం కోపంగానే ఉన్నారు.
అయితే పవన్ కళ్యాణ్ మాత్రం జనసేన పార్టీ టీడీపీతో పొత్తుకు సిద్ధంగా ఉందని సంకేతాలు ఇచ్చారు. 2014 ఎన్నికల ఫలితాలను రిపీట్ చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. అయితే టీడీపీ జనసేన పొత్తు విషయంలో పవన్ కళ్యాణ్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. చిరంజీవి ఒంటరి అయిపోతున్నారని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే మెగా హీరోల మద్దతు ఆ పార్టీకి ఉంటుందో లేదో క్లారిటీ రావాల్సి ఉంది. టీడీపీ జనసేన పోటీ చిరంజీవికి ఇష్టం లేదని నేపథ్యంలో ఆయన ఏ విధంగా వ్యవహరిస్తారో చూడాల్సి ఉంది.