కాకినాడ లో దారుణం : వైసీపీ కార్పొరేటర్ రమేష్ దారుణ హత్య !

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కార్పొరేటర్ కంపర రమేష్‌ హత్యకు గురయ్యారు. కాకినాడ రూరల్ వలస పాకలో వద్ద నాలుగో వార్డ్ కార్పొరేటర్ కంపర రమేష్ తన స్నేహితులతో పార్టీ చేసుకుంటున్నారు. రెవెన్యూ కాలనీకి చెందిన చిన్నా రమేష్‌కి ఫోన్ చేశారు. మాట్లాడే పని ఉందని రమేష్ ‌కు చెప్పారు. కార్పొరేటర్ వలసపకల దగ్గర ఉన్నామని చెప్పడంతో చిన్నా సోదరుడు కుమార్ కారులో వలసపకలకు వెళ్లారు.

రమేష్, చిన్నా కొంత సేపు మాట్లాడిన తర్వాత చిన్నా వెళ్ళిపోతానని చెప్పడంతో రమేష్ పుట్టినరోజు పార్టీ ఉందని వెళ్దామన్నాడు. దీంతో రమేష్ చిన్నాల మధ్య ఘర్షణ జరిగింది. వెంటనే చిన్నా కుమార్‌లు కారుతో రమేష్‌ను ఢీ కొట్టారు.. మూడుసార్లు కారును రమేష్ మీద నుంచి ఎక్కించారు. తర్వాత చిన్నా, కుమార్ కారులో పరారయ్యారు.

తీవ్రగాయాలైన రమేష్ ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారు. సమాచారం అందుకన్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు.. పాత కక్షలతో హత్య చేశారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.