ఇంగిత జ్ఞానం పోయిందా.. ఫ్రస్ట్రేషన్ లో బ్రెయిన్ పోయిందా.. లేక, మతి స్థిమితం తప్పిందా… అదీగాకపోతే… ఏదోలాగా తృప్తి పడాలనే తాపత్రయంలో కామన్ సెన్స్ ను పక్కనపెట్టేసిందా? సమాధానం తెలియదు కానీ… చంద్రయాన్ – 3 సక్సెస్ ని చంద్రబాబు తో ముడిపెట్టేస్తోంది ఎల్లో మీడియా!
అవును… ప్రపంచం మొత్తం భారత్ వైపు చూసేలా చంద్రయాన్-3 సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఈ సక్సెస్‌ను దేశమంతా సెలబ్రేట్ చేసుకుంటోంది. ప్రపంచం మొత్తం భార్త్ ను కొనియాడుతోంది. ఇంటర్నేషనల్ మీడియా బ్యానర్ ఐటంస్ వేస్తోంది.. ఇండియా గ్రేట్ అంటూ పొగుడుతుంది.
ప్రపంచం మొత్తానిది ఒక దారైతే ఎల్లో మీడియాది ఒకదారి అన్నట్లుగా తాజాగా ఒక ఛానల్ వ్యవహరిస్తోంది. ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది. దీన్ని చిల్లరతనం అనాలా… లేక, దిగజారుడు తనం అనాలో తెలియక నెటిజన్లు ఏమని కామెంట్ పెట్టాలో తెలియక సతమత మవుతున్నారు.
చంద్రయాన్ – 3 సక్సెస్ విషయంలో ఎల్లో మీడియా పైత్యమంతా బయటపడుతోంది. చంద్రయాన్ సక్సెస్ కు.. తెలుగుదేశం పార్టీ సక్సెస్ కు ముడిపెట్టేసింది. చంద్రయాన్ 3 సక్సెస్ అయ్యిందంటే చంద్రబాబునాయుడు కూడా సక్సెస్ అయిపోయినట్లేనట. ఏపీలో కూడా చంద్రయానమే.. చంద్రోదయమే.. చంద్రమే అని యాంకర్ చెప్పుకుంటున్నారు!
అక్కడితో ఆగని ఆ యాంకర్… చంద్రయాన్ సక్సెస్ అయిన దగ్గర నుండి చంద్రబాబు సక్సెస్ గురించి విపరీతమైన ఫోన్లు వస్తున్నాని చెబుతున్నారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు సక్సెస్ గురించి మెసేజ్ లు తెగ సర్క్యులేట్ అవుతున్నాయని చెప్పుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.
చంద్రయాన్ – 3 క్ సక్సెస్ కు ఏపీలో టీడీపీ సక్సెస్ కు ఏమైనా సంబంధం ఉందా… జనాలు నవ్వుతారేమో… వెటకారం ఆడతారేమో… సిగ్గు సిగ్గు అనే కామెంట్లు పెడతారేమో అనే ఆలోచన ఏమాత్రం లేకుండా ఈ ప్రకటన చేసేశారు. దీంతో నెట్టింట కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
ఇందులో భాగంగా… ఎల్లో మీడియాలోని ఛానల్ యాంకర్ గారి పిచ్చి ఏ స్థాయిలో ముదిరిపోయిందో అంటున్నారు నెటిజన్లు. రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే విషయంలో చంద్రబాబుకే నమ్మకం కలగటంలేదని కథనాలొస్తున్న తరుణంలో… ఎల్లో మీడియా ఛానల్ యాంకర్ మాత్రం పదే పదే చంద్రబాబు అధికారంలోకి వచ్చేసినట్లే అని చెప్పటమే విచిత్రంగా ఉందని అంటున్నారు.