రాష్ట్రంలో తను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పాజిటివ్ గా ఏం జరిగినా ఆ ఘనత తన గొప్పదనమే అని చెప్పుకోవడానికి చంద్రబాబు నాయుడు చేసే ప్రయత్నాలు అన్నీఇన్నీ కావు. ఇప్పటికీ హైదరాబాద్ అభివృద్ధికి తానే కారణమని చంద్రబాబు చాలా సందర్భాల్లో వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే 2024 ఎన్నికల్లో కూడా తన విజన్ మరోసారి అధికారంలోకి రావడానికి కారణమవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు.
విజన్ కచ్చితంగా కాపాడుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. ఏపీ ప్రజల్లో జగన్ సర్కార్ పై వ్యతిరేకత ఉన్న అంశాలు తనకు అనుకూల అంశాలు అవుతాయని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోందీ. మారుతున్న రాజకీయ సమీకరణలకు అనుగుణంగా చంద్రబాబు సైతం తన నిర్ణయాలను మార్చుకుంటున్నారని కొంతమంది కామెంట్లు వ్యక్తం చేస్తుండటం గమనార్హం. జనసేనతో పొత్తు ఉన్నా లేకపోయినా ఇబ్బందులు రాకుండా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు.
జగన్ సర్కార్ ప్రభుత్వ పథకాలను బాగానే అమలు చేస్తున్నా అన్ని వర్గాల ప్రజలకు బెనిఫిట్ కలిగేలా చేయడంలో తప్పులు చేస్తోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తన పర్యటనలకు ప్రజల నుంచి స్పందన బాగానే వస్తుండటంతో చంద్రబాబు సైతం వచ్చే ఎన్నికల్లో తమ పార్టీదే విజయం అని భావిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో జగన్ సర్కార్ పై ఉన్న వ్యతిరేకత కూడా పార్టీకి ప్లస్ అవుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి పేరుతో టీడీపీ నిర్వహిస్తున్న కార్యక్రమానికి ప్రజల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తుండటం చంద్రబాబు సంతోషానికి కారణమవుతోంది. బీజేపీ సపోర్ట్ లభిస్తే తమకు తిరుగుండదని చంద్రబాబు నాయుడు భావిస్తుండగా బీజేపీ నుంచి ఈ పార్టీకి సపోర్ట్ లభిస్తుందో లేదో చూడాల్సి ఉంది.