చంద్రబాబు మారరా.. అబద్ధాలతో ఎంతకాలం పాలన సాగిస్తావు బాబు?

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏ విషయం గురించి మాట్లాడినా మాటలు కోటలు దాటుతాయనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. 2014 నుంచి 2019 మధ్య తాను అధికారంలో ఉన్న సమయంలో వేల సంఖ్యలో ఉద్యోగాలు ఇచ్చానని చంద్రబాబు చెబుతుండటం గమనార్హం. 30 లక్షల మందికి తాను ఉద్యోగాలు ఇచ్చానని చంద్రబాబు చెబుతుండటం హాట్ టాపిక్ అవుతోంది.

 

అయితే చంద్రబాబు చెబుతున్నది నిజమేనా అని గమనిస్తే మాత్రం నిజం కాదని వాస్తవాల ద్వారా వెల్లడవుతోంది. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో ఏపీ ప్రజలకు తెలియనిది కాదు. తప్పుడు లెక్కలతో పాలన సాగించే చంద్రబాబు నాయుడు ఆ పాలన వల్ల ఎన్నో సందర్భాల్లో విమర్శలను మూటగట్టుకుంటున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడు ఇలాంటి మాటలు చెప్పి ప్రస్తుతం దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.

 

తెలుగుదేశం పార్టీ అంటే సాధారణ ప్రజలతో పాటు నేతలు సైతం నమ్మలేని పరిస్థితి నెలకొంది. చంద్రబాబు నాయుడు ఎంత గొప్ప హామీలు ఇచ్చినా ఆ హామీలు అమలు చేయడం సాధ్యం కాదని మరి కొందరు అభిప్రాయం చేస్తున్నారు. సోషల్ మీడియాలో యుగంలో అబద్ధాలతో ప్రజలను నమ్మించాలని చంద్రబాబు ప్రయత్నించినా నిజ జీవితంలో అలా జరగడం సాధ్యం కాదు.

 

కాలంతో పాటు చంద్రబాబు సైతం మారాల్సిన అవసరం అయితే ఉంది. ప్రజలకు చంద్రబాబు మంచి చేసే దిశగా అడుగులు వేస్తే ప్రజలే చంద్రబాబుకు సపోర్ట్ చేస్తారనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చంద్రబాబు ప్రజలను మోసం చేయాలని ప్రయత్నం చేస్తే మాత్రం మోసపోయేది ఆయనేనని కొంతమంది కామెంట్లు చేస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.