హరికృష్ణ ఇంట్లో చంద్రబాబు, హీరోయిన్ అనుష్క నవ్వుతున్నారా?

హరికృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించటానికి అందరూ హరికృష్ణ నివాసానికి చేరుకుంటున్నారు. ఆయన మృతికి సంతాపం తెలుపుతూ, కుటుంబీకులను ఓదారుస్తున్నారు. హరికృష్ణ ఇక లేరని ఆయన మృతదేహం వద్ద పలువురు విలపిస్తున్నారు. ఈ నేపథ్యంలో హరికృష్ణ మృతదేహం పక్కన కూర్చుని మాట్లాడుకుంటున్న చంద్రబాబు నాయుడు, హీరోయిన్ అనుష్క ఫోటో వైరల్ అవుతుంది. ఈ ఫొటోలో చంద్రబాబు, అనుష్క నవ్వుతూ కనిపిస్తున్నారు.

ఒక పక్కన హరికృష్ణ చనిపోయి అందరూ తీవ్ర దుఃఖంలో ఉంటే వీరిద్దరూ ఇలా ఆయన మృతదేహం పక్కనే కూర్చుని నవ్వుకోవడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఫోటో ఇప్పుడు వైసీపీ, జనసేన వర్గాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. చంద్రబాబుది వెన్నుపోటు రాజకీయం అంటూ విమర్శించే యాంటీ ఫ్యాన్స్ మరోసారి చంద్రబాబు బుద్ధి బయటపడిందంటూ దువ్వెత్తి పోస్తున్నారు. రాజకీయ వర్గాల్లోనూ, హరికృష్ణ అభిమానుల్లోనూ ఇప్పుడు ఇది హాట్ టాపిక్ అయిపోయింది. ఆ ఫోటోలు కింద ఉన్నాయి మీరు కూడా చూడవచ్చు.