కడప రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్ధిని ప్రకటించిన చంద్రబాబు

ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతుండడంతో అభ్యర్ధుల ఎంపికకు చంద్రబాబు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. కడజ జిల్లా రాజంపేట అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్ధిని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడుని ఎమ్మెల్యే అభ్యర్ధిగా ప్రకటించారు. గురువారం నియోజకవర్గ నేతలతో సమావేశమై అందరి సమక్షంలో చెంగల్రాయుడు పేరును ప్రకటించారు. 

 అదే సమయంలో అసంతృప్తులను ఆయన బుజ్జగించారు. దీంతో ఎమ్మెల్యే అభ్యర్దులను ప్రకటిస్తుండడంతో నేతలంతా అలర్ట్ అయ్యారు. అసంతృప్తులు పక్కదారి పట్టకుండా కూడా చంద్రబాబు ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. వారికి నామినేటేడ్ పదవులు ఇస్తామని లేదా ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పిస్తామని హామీనిచ్చారు.