ఆళ్లగడ్డ రాజకీయాల్లో చక్రం తిప్పనున్న భూమా మౌనిక.. మంచు మనోజ్ వల్లేనా?

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ రాజకీయాలకు సంబంధించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. ప్రస్తుతం గంగుల బ్రిజేంద్ర రెడ్డి ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా ఉన్నారు. భూమా అఖిలప్రియ ప్రస్తుతం టీడీపీలో ఉండగా పలు వివాదాల ద్వారా ఆమె వార్తల్లో నిలిచారనే సంగతి తెలిసిందే. అయితే అఖిలప్రియకు సోదరి మౌనికా రెడ్డి నుంచి భారీ షాక్ తగలనుందని సమాచారం అందుతోంది. మౌనికకు కూడా రాజకీయాలపై ఆసక్తి ఉంది.

అయితే విభేదాలు ఉండటంతో ఆమె రాజకీయాలపై ఇప్పటివరకు పెద్దగా దృష్టి పెట్టలేదు. ఆళ్లగడ్డలో మౌనికను అభిమానించే వాళ్ల సంఖ్య కూడా తక్కువేం కాదు. కార్యకర్తల్లో కూడా మౌనికపై మంచి అభిప్రాయం ఉంది. అఖిలప్రియ వివాదాల ద్వారా వార్తల్లో నిలిచినా మౌనిక మాత్రం వివాదాలకు దూరంగా ఉండటం గమనార్హం. మంచు మనోజ్ సపోర్ట్ ఉండటంతో ఆళ్లగడ్డ రాజకీయాలలో చక్రం తిప్పాలని భూమా మౌనిక భావిస్తున్నారు.

మంచు మనోజ్, భూమా మౌనిక త్వరలో పెళ్లి చేసుకునే అవకాశం ఉందని అటు రాజకీయ వర్గాల్లో ఇటు సినీ వర్గాల్లో వినిపిస్తోంది. మంచు మనోజ్ కూడా రాజకీయాలపై దృష్టి పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. అక్క విషయంలో తాడోపేడో తేల్చుకోవాలని మౌనిక డిసైడ్ అయ్యారని బోగట్టా. ఆస్తుల విషయంలో ఉన్న సమస్యలను కూడా మౌనిక పరిష్కరించుకోవాలని భావిస్తున్నారని బోగట్టా.

ఆళగడ్దలో అక్కాచెల్లెళ్ల మధ్య పోరు మొదలైతే ప్రజలు ఎవరిని గెలిపించడానికి సిద్ధమవుతారో చూడాల్సి ఉంది. భూమా మౌనిక ఎంట్రీతో అఖిల ప్రియకు కొత్త సమస్య ఎదురైనట్టేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఏపీ సీఎం జగన్ సైతం ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టారని తెలుస్తోంది. భూమా మౌనిక రాజకీయాల్లోకి వస్తే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనే ప్రశ్నకు సైతం సమాధానం దొరకాల్సి ఉంది.