బావ చంద్రబాబు కోసం బాలయ్య అన్‌స్టాపబుల్ పొలిటికల్ స్కెచ్.!

జస్ట్ మైండ్ బ్లోయింగ్ అంతే.! అన్‌స్టాపబుల్ టాక్ షో రెండో సీజన్ ప్రారంభానికి సంబంధించి విడుదల చేసిన ఫస్ట్ ఎపిసోడ్ తాలూకు టీజర్ అదిరిపోయింది.! నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న ఈ అన్‌స్టాపబుల్ షో రెండో సీజన్ స్పెషల్ గెస్ట్ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు. చంద్రబాబుతోపాటు ఆయన తనయుడు లోకేష్ కూడా ఈ షోలో సందడి చేయబోతున్నారు.

చంద్రబాబు అంటే కేవలం టీడీపీ అధినేత కాదు, ఆ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకి స్వాయానా బావ కూడా. ఆ చంద్రబాబు కుమారుడు నారా లోకేష్‌కి పిల్లనిచ్చిన మామ, అలాగే మేనమామ కూడా.! తెలుగుదేశం పార్టీకి ఊపిరిలూదేందుకేనా.? అన్నట్లుగా అన్‌స్టాపబుల్ కార్యక్రమం ద్వారా పలు ఆసక్తికరమైన ప్రశ్నలు నందమూరి బాలకృష్ణ వేసేశారు.

స్వర్గీయ ఎన్టీయార్‌కి చంద్రబాబు రాజకీయంగా వెన్నుపోట పొడిచారంటూ జరుగుతున్న ప్రచారం తాలూకు విషయాన్నీ బాలయ్య ప్రస్తావించారు. నారా లోకేష్, వయసులో వున్నప్పుడు.. అంటే, చదువుకునే రోజుల్లో అమ్మాయిలతోఎంజాయ్ చేయడానికి సంబంధించి కూడా ఈ టాక్ షోలో ప్రస్తావించడం గమనార్హం.

ఇండియాలోనే టాలెస్ట్ (ఇమేజ్, పాపులారిటీ పరంగా) పొలిటీషియన్లలో చంద్రబాబూ ఒకరనీ, రాళ్ళు రప్పలతో వున్న ప్రాంతాన్ని హైటెక్ సిటీగా మలచారనీ.. బాలయ్య బహు గొప్పగా బావ చంద్రబాబుని అన్‌స్టాపబుల్ షో ద్వారా ప్రమోట్ చేసినట్లు కనిపిస్తోంది. ప్రజలందరి బంధువు.. అంటూ చంద్రబాబు గురించి ఇంట్రో ఇవ్వడం మరో విశేషం.

ఇదేదో, పొలిటికల్ మీటింగ్‌లో చంద్రబాబు భజన.. అన్నట్లుగా కనిపిస్తోందన్నది సర్వత్రా వినిపిస్తోన్న విమర్శ. ఫుల్ ఎపిసోడ్‌లో బాలయ్య ఇంకెలాంటి ‘పచ్చటి’ అద్భుతాలు చేశారో వేచి చూడాల్సిందే.