అసెంబ్లీలో మీసం మెలేశాడట.! అంతేనా, సినిమాల్లో చేసినట్లు అసభ్యకరమైన ‘షో’ కూడా చేశాడట.! తొడ కూడా కొట్టేశాడట.! నందమూరి బాలకృష్ణ విశ్వరూపాన్ని ఈసారి అసెంబ్లీలో అందరూ చూశారు. అందులో కొంత విశ్వరూపాన్ని కొన్ని వీడియోలు సభ్య సమాజానికీ పరిచయం చేశాయి.!
చట్ట సభలంటే, ఎప్పుడో గౌరవం పోయింది జనానికి. స్పీకర్ ఛెయిర్‌లో వున్నోళ్ళూ మాట మీద అదుపు కోల్పోతున్నారు. మహిళా ప్రజా ప్రతినిథులు సైతం, నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారు. అక్కడా ఇక్కడా.. అన్న తేడాల్లేవ్.! అంతటా ఇదే పరిస్థితి.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అయితే, ఇంకాస్త జుగుప్సాకరం. అధికార పార్టీ శాసనసభ్యులు అత్యంత అసభ్యకరంగా వ్యవహరించడం అనేది గతంలో చూశాం. వైసీపీ వర్సెస్ టీడీపీ.. ఈ అసభ్యకర పంచాయితీ ఎప్పుడూ జరుగుతూనే వుంది. కాకపోతే, ఈసారి బాలయ్య వంతు.!
తన బావ చంద్రబాబుని వైసీపీ సర్కారు అక్రమంగా అరెస్టు చేసిందని బాలయ్య ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సిందిపోయి, చంద్రబాబు అరెస్టు చుట్టూ హైడ్రామా నడిచింది. ఈ క్రమంలో ఇరువర్గాలూ మీసం మెలేశాయ్, తొడలు కొట్టాయ్.
ఈ తరహా తగాదాల్లో ఎప్పుడూ బలైపోయేది ప్రతిపక్షమే. ఇప్పుడు ప్రతిపక్షం టీడీపీ గనుక, టీడీపీ సభ్యుల్ని గెంటివేయడం జరిగింది. బాలయ్య వ్యవహారానికి వస్తే, అంబటి రాంబాబు రెచ్చగొట్టడంతో విషయం ముదిరి పాకాన పడింది. మంత్రి అంబటికి ఇదో అడ్వాంటేజ్ అయ్యింది కూడా.!
‘నేను కాపు’ అంటూ అంబటి రాంబాబు నిస్సిగ్గుగా ‘కులం’ ట్వీటేసుకోవడానికి, బాలయ్య ఆస్కారం కల్పించినట్లయ్యింది.