బాలయ్య వర్సెస్ జూనియర్ ఎన్టీయార్.! గెలుపెవరిది.?

అసలెందుకీ పిచ్చి పోటీ.? వెర్రి ట్రోలింగ్.? సినీ నటుడు జూనియర్ ఎన్టీయార్ పుట్టుక మీద కూడా వివాదమేనా.? చాలా జుగుప్సాకరమైన రీతిలో యంగ్ హీరో ఎన్టీయార్ మీద ట్రోలింగ్ జరుగుతోంది.

ట్రోల్ చేస్తున్నవారిలో చాలామంది ‘నందమూరి’ అభిమానులే వున్నారు. వాళ్ళంతా టీడీపీ మద్దతుదారులు, పైగా బాలకృష్ణకి వీరాభిమానులు. ‘నీ పుట్టుక సరైంది కాకపోయినా, నందమూరి కుటుంబంలో నీకు చోటిచ్చాం..’ అంటూ సదరు నందమూరి అభిమానులు జూనియర్ ఎన్టీయార్ మీద దారుణమైన కామెంట్లు చేస్తున్నారు.

ఇదంతా, స్వర్గీయ ఎన్టీయార్ శత జయంతి ఉత్సవాల్లో జూనియర్ ఎన్టీయార్ పాల్గొనకపోవడం వల్లేనా.? అంటే, అంతకు ముందు నుంచే నడుస్తోన్న ఈ ఆధిపత్య పోరు, ఇప్పుడు ముదిరి పాకాన పడిందంతే.

త్వరలో మహానాడు జరగబోతోంది. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీయార్ మీద ఇంకా దారుణమైన ట్రోలింగ్ జరుగుతుంది. సినిమాల్లో బాలయ్య స్టామినా వేరు, యంగ్ టైగర్ ఎన్టీయార్ రేంజ్ వేరు. ఈ విషయాన్నే జూనియర్ ఎన్టీయార్ అభిమానులూ ప్రస్తావిస్తున్నారు.

‘ఇకపై మేమేంటో చూపిస్తాం.. టీడీపీ ఓటమి కోసం కృషి చేస్తాం. బాలకృష్ణనీ ఓడించి తీరతాం. లోకేష్‌ని గెలవనివ్వం.. చంద్రబాబు ఓడిపోవడం ఖాయం’ అని జూనియర్ ఎన్టీయార్ అభిమానులు శపథం చేస్తున్నారు.