రాజకీయాల్లో రచ్చ రంబోలా లాగ తయారయ్యారు బాలయ్య. సినిమా స్టైల్లో ఆయన నడి రోడ్లపై వీరంగం చేస్తూంటే చూసిన వాళ్లు నవ్వుకుంటున్నారు. సొంత పార్టీ వాళ్లు ఏం చేయాలో తెలియక దిక్కులు చూస్తున్నారు. కారణాలేంటనేది తెలియదు కానీ ఆయనకు తెగ కోపం వస్తోంది. దాంతో తన, తమ అనే బేధం లేకుండా అందరి మీదా ఎటాక్ చేసేస్తున్నారు. ఆ మధ్యన మీడియా వ్యక్తిపై తన ప్రతాపం చూపి, చివరకు క్షమాపణ చెప్పిన బాలయ్య రీసెంట్ గా తన సొంత అభిమానిని కొట్టారు.
ఆదివారం విజయనగరం జిల్లాలో జరిగిన ఈ సంఘటన అంతటా హాట్ టాపిక్ గా మారింది. నడిరోడ్డుపై అభిమానిని వెంబడించి మరీ కొట్టారు బాలయ్య వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. చీపురుపల్లిలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన బాలయ్య ఉన్నట్టుండి తన వెహికల్ దిగి… పార్టీ కార్యకర్త కం అభిమానిని పట్టుకొని మరి కొట్టడం మీడియాలో హైలెట్ అయ్యింది.
తమ పార్టీ కార్యకర్తలు ఫొటో తీసుకోవడానికి ఎగబడ్డంతో ఒక్కసారిగా కోపంతో ఊగిపోయిన ఆయన ఓ కార్యకర్త వెంటపడ్డారు. నడిరోడ్డుపై పరుగులు పెట్టించి అతడిపై పిడిగుద్దులు గుద్ది.. కాళ్లతో తన్నారు. ఆ అభిమానిని బూతులు కూడా తిట్టారు. ఇలా బాలయ్యరెచ్చి పోవటం చూసి టీడీపీ నేతలు ఒక్కసారిగా షాక్ తిన్నారు .