అరుంధతీ రాయ్ నవలొచ్చేసింది, సీతారాం రివ్యూ తొందర్లో…

ఈ రోజే అందుకున్నా…
సుకుమారమైన నీ వచన సాగరం లో సేద తీరాలని ఎన్నాల్లో ఎదురు చూపు. డియర్ రాయ్ లవ్ యు . “మినిస్టరీ అఫ్ అట్ మోస్ట్ హ్యాపీనెస్” ఆ పుస్తకానికి కాశ్మీరీ లోయలో అనామకంకా మిగిలిన వేలాది శిలాఫలకాలంలో ఒక సమాధి ముఖ చిత్రం. ఒక రకంగా ఈ దేశ ముఖచిత్రం. తన జీవితం లో మిగిలిన విషాదానికి అక్షర రూపం మొదటి నవల అది గాడ్ అఫ్ స్మాల్ థింగ్స్ . అది మొదలు,ఊహలు సైతం అంతం అవ్వాలని, ఆనకట్టలు ఆధునిక సమాధుల వనాలని, ప్రేతాత్మల ఆత్మ కథల కు కథా గౌరవం ఇచ్చి ,కారడవిలో కలదిరిగి కనుగొన్న నూతన మానవుని స్వప్నాలు కని ఇలా ఆధునిక ప్రేతాత్మలతో సంభాషనే ఎన్నుకొని . ఇరవై ఏళ్ళ తర్వాత ఇంకో పుస్తకం. అక్కడక్కడా కొన్ని భాగాలు చదివాను. దేశంలో మొదటి సారి కాషాయ పాలన మొదలు ఈ దేశం వ్యవస్థీకృత హింసకు బలి అయిన ప్రతి పాత్రా ఈ పుస్తకం లో తన కన్నీటి గాదను వినమని చెబుతాది. రాయ్ తన పుస్తకానికి ఒక సమాధి శిలా పలకాన్ని ఎన్ను కున్నప్పుడే అందునా కాశ్మీరీ లోయలో నుంచి ఎన్నుకోవడం లొనే ఆమె మనకు ఏం చెప్ప బోతోందో అర్ధం అవుతోంది. చచ్చిన శవాలకూ భయపడే దేశం ఇది, జుక్పార్ అలీ భుట్టో మొదలు, అఫ్జల్ గురు, సాయిబాబా దాకా కారగారాలే కార్య క్షేత్రాలు అయిన చోట. ఉరి తీసి జైలులో ఖననం చేయడం ఏ దేశం లో అయినా మనం చూడగలమా ?? ఈ దేశం లో మానవత్వాన్ని నిలిపే క్రమం లో ఎంతో మంది తన ప్రస్థానాన్ని అసహజంగా ముగించారు. నేడు హోమోసెక్సుల్ రాజకీయాలు ప్రపంచ వ్యాప్తంగా ముందుకు వచ్చాయి.ఇందులో కథా నాయకి(కుడు) థర్డ్ జెండర్, సద్దాం హుస్సేన్ కూడా ఒక పాత్ర పేరు.చరిత్ర,సంస్కృతి,మతం,రాజకీయం,సూఫీ,మావోయిజం, లాంటి అనేక స్వాభిమాన పోరాటాల నేపధ్యం ఈ నవల.

                                                     ప్రముఖ రచయిత, కవి గుర్రం సీతారాం  ఫుల్ రివ్యూ తొందర్లో…