ఆంధ్రప్రదేశ్ శ్రీలంక లాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి: చంద్రబాబు

తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తమ రాష్ట్ర ప్రభుత్వం విధానాలపై మండిపడ్డారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక లాంటి పరిస్థితిలు తమ రాష్ట్రంలోని ఇప్పటికీ ఉన్నాయని అన్నారు. ఉద్యోగులకు జీతాలు సకాలంలో ఇవ్వటం లేదని.. జీపీఎఫ్ విత్ డ్రా చేసుకునే పరిస్థితి కూడా లేదని అన్నారు.

అంతేకాకుండా రిటైర్మెంట్ తీసుకున్న ఉద్యోగులకు కూడా ఇవ్వాల్సినవి సక్రమంగా ఇవ్వడం లేదని.. గుత్తేదారులకు బిల్లులు చెల్లించవలసిన పరిస్థితి లేదని.. ప్రభుత్వం చేసిన అప్పులకు వాటికి వడ్డీలు కట్టుకోవడానికి మళ్ళీ కొత్తగా అప్పులు చేస్తుందని అన్నారు. ఇక మూలధన వ్యయం తగ్గిపోయిందని.. రోడ్డు మార్గాల మరమ్మతులు కూడా చేయటం లేదని.. ఇవన్నీ శ్రీలంక లాంటి పరిస్థితులు కావా అంటూ ప్రశ్నించారు. ఇక పోలవరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు తమపై ఎదురుదాడి చేస్తుందని వ్యాఖ్యలు చేశారు.