చింతమనేని మళ్ళీ  గెలిస్తే … ? అపూర్వ

కారెక్టర్  యాక్ట్రెస్  అపూర్వ అంటే తెలియని వారు వుండరు , సరసమైన శృగారం , కామెడీని పండించడంలో అపూర్వకు మంచి పేరుంది . అపూర్వ ఇటీవల వార్తల్లోకి వచ్చేసింది . శ్రీరెడ్డి , మాధవి లత తరువాత  తెలుగు సినిమాలో కాస్టింగ్ కౌచ్ గురించి అపూర్వ ధైర్యంగా మాట్లాడింది . సినిమా రంగంలో అలాంటివన్నీ మామూలేనని ఐయితే   తనకు కూడా మొదట్లో అలాంటివి ఎదురైనా సున్నితంగా తప్పించుకున్నానని చెప్పింది . చలపతిరావు  తనకు  బంధువు కావడం ఆయన సపోర్ట్ ఉండటంతో ఏ సమస్య లేకుండా సినిమాలు చేసుకుంటున్నా అని చెప్పింది .

తమది ఏలూరు అని అక్కడ ఆస్తిపాస్తులున్నాయని , వాటికోసం అక్కడికి వెడితే  శాసన సభ్యుడు చింతమనేని ప్రభాకర్ చాలా ఇబ్బంది పెట్టాడని , ఎవరికీ చెప్పుకున్నా తమ సమస్య పరిస్కారం కాలేదని , అలాంటి రౌడీ మళ్ళీ ఎన్నికల్లో గెలిస్తే ఏలూరు లో వున్న ఆస్తి  అమ్మీసి హైద్రాబాద్ లోనే స్థిరపడతామని అపూర్వ ఆవేదనగా చెప్పింది .

అలాంటి రౌడీలు, గూండాలు వున్న పార్టీ  తెలుగు దేశం అని చెప్పుకోవడాని చాలా సిగ్గేస్తుందని , తాము మొదటి నుంచి తెలుగు దేశం పార్టీకే ఓటు వేశామని ,రామారావు గారంటే ఎంతో అభిమానమని అపూర్వ చెప్పింది . అలాంటి తెలుగు దేశంలో ఇప్పుడు రౌడీలు  రాజ్యమేలుతున్నారని ఆమె చెప్పింది