Home Andhra Pradesh 40 ఇయ‌ర్స్ బాబు క‌థ ముగిసిన‌ట్లే.. మంత్రి బొత్స సంచ‌ల‌నం..!

40 ఇయ‌ర్స్ బాబు క‌థ ముగిసిన‌ట్లే.. మంత్రి బొత్స సంచ‌ల‌నం..!

టీడీపీ అధినేత చంద్రబాబు పై వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాజ్యసభ ఎన్నికల నేపధ్యంలో ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన బొత్స.. ఒక‌వైపు సంఖ్యాభలం లేక‌పోయినా.. మ‌రోవైపు ఓటమి తప్పద‌ని తెలిసినా కూడా వర్ల రామయ్యను బరిలోకి కావాల‌నే దించార‌ని.. దీంతో చంద్ర‌బాబు దళితులను అవమానించటమే అని.. బలం లేదని తెలిసినా కూడా టీడీపీ అభ్యర్ధిని బరిలోకి దింపటం నీచ‌మ‌ని బొత్స స‌త్య‌నారాయ‌ణ వ్యాఖ్యానించారు.

తాజా రాజ్యసభ ఎన్నిక‌ల‌ బరిలో టీడీపీ నిలవటం ద్వారా.. ప్రజల్లో పలుచన కావటం తప్ప సాధించింది ఏమీ లేద‌ని.. చంద్ర‌బాబు వంక‌ర బుద్ధి కార‌ణంగా టీడీపీ చివ‌రికి మరోసారి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంద‌ని బొత్స విమ‌ర్శించారు. టీడీపీ గెలిచే అవకాశం ఉన్న ప్రతిసారి కూడా బడాబాబులకే టిక్కెట్లు ఇచ్చింద‌ని.. అయితే ఇప్పుడు చ్చితంగా ఓడిపోయే సీటును మాత్రం వర్ల రామయ్యకు కేటాయించటం అనేది టీడీపీ ఎలా సమర్ధించుకున్నా కూడా దాంట్లో ఏ మాత్రం హేతుబద్దత బొత్స‌ కన్పింద‌న్నారు.

ఇక చంద్రబాబు అంత మోసగాడు ఎవరూ లేరని, ఆయన జీవితం అంతా కుట్ర రాజకీయాలే అని బొత్స మండి ప‌డ్డారు. అలాగే గవర్నర్ ప్రసంగం వినడం ఇష్టం లేని చంద్రబాబు, గవర్నర్‌ను ఎలా కలుస్తారు అని బొత్స ప్రశ్నించారు. చంద్రబాబు రాజకీయ పుస్తక పేజీ చిని గిపోయిందని, ఇక అందులో కొత్త పేజీలు లేవని.. చంద్ర‌బాబు చాణ‌క్యం ఇక‌ముందు ప‌ని చేయ‌ద‌ని, 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ క‌థ త్వ‌ర‌లో పూర్తిగా క‌నుమ‌రుగు అయిపోతుంద‌ని బొత్స వ్యాఖ్యానించారు. మ‌రి బొత్స వ్యాఖ్య‌లు టీడీపీ బ్ర‌ద‌ర్స్ రియాక్ష‌న్ ఎలా ఉంటుందో చూడాలి.

- Advertisement -

Related Posts

‘గల్లా సార్ వెళ్లిపోతా అంటున్నారు’ చంద్రబాబుకి బిగ్ బ్యాడ్ న్యూస్ అందింది

ఓటమి షాక్ నుండి తేరుకుంటున్న క్రమంలో తెలుగుదేశం పార్టీకి నేతలు వరుస షాక్స్ ఇస్తున్నారు.  ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీలోకి వెళ్లిపోయారు.  ఇక గెలిచిన ముగ్గురు ఎంపీలు తలోదిక్కు అన్నట్టు ఉన్నారు.  కేశినేని నాని,...

‘అదేంటి ఇలా జరిగింది’ నమ్మలేకపోతోన్న దేవినేని ఉమ

దేవినేని ఉమామహేశ్వరరావు.. టీడీపీలో ప్రముఖమైన వ్యక్తి.  దశాబ్ద కాలంపాటు తెలుగుదేశంలో ఈయన మాట వేదవాక్కుగా చెలామణీ అయింది.  రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చిన దేవినేని ఉమా కృష్ణా జిల్లా రాజకీయాల్లో కీలకమైన వ్యక్తిగా మారిపోయారు. ...

తిరుపతిలో కొడితే రాష్ట్రం మొత్తం టీడీపీ క్లోజ్.. ఇదే జగన్ ప్లాన్ 

సార్వత్రిక ఎన్నికల తర్వాత వస్తున్న ఉపఎన్నికలు కావడంతో తిరుపతి లోక్ సభ బై ఎలక్షన్ల మీద అన్ని పార్టీలు తీవ్రంగా కసరత్తులు చేస్తున్నాయి.  సర్వ శక్తులను కూడగట్టుకుని బరిలోకి దిగుతున్నాయి.  ఇప్పటికే చంద్రబాబు నాయుడు పనబాక లక్ష్మిని అభ్యర్థిగా...

బైరెడ్డి అన్న ఆ మాటకు నానియే షాకయ్యారు..జగన్‌ చెవినపడితే ఎమన్నా ఉందా ?

వైఎస్ జగన్ ప్రతిపక్షంలో ఉండగా సొంత పార్టీ నేతలకు నిత్యం అందుబాటులో ఉండేవారు.  ప్రతిఒక్కరితోనూ వ్యక్తిగతంగా టచ్లో ఉండేవారు.  కానీ సీఎం అయ్యాక.. కనీసం ముఖం చూపించే టైం కూడ లేకుండాపోయింది ఆయనకు.  పాలనలో...

Latest News