మూతిమీద వాత పెట్టాల్సిందేనా  ?

చంద్రబాబునాయుడు మూతిమీద అట్లకాడతో కాల్చి వాత పెట్టాలా ? వైసిపి ఎంఎల్ఏ అంబటి రాంబాబు అలాగే చెబుతున్నారు మరి. జగన్మోహన్ రెడ్డి మీద లేనిపోని అబద్ధాలు చెబుతున్నందుకు అట్లకాడ కాల్చి చంద్రబాబు మూతిమీద వాత పెట్టాలని జనాలకు అంబటి పిలుపిచ్చారు. జనాలు తనను ఘోరంగా ఓడించినందుకు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన చంద్రబాబు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపోయారు.

అఖండ విజయంతో జగన్ సిఎం కావటాన్ని జీర్ణించుకోలేని చంద్రబాబు ఉద్దేశ్యపూర్వకంగానే పులివెందుల పంచాయితి అంటూ నానా యాగీ చేస్తున్నట్లు మండిపడ్డారు. అంబటి చేసిన ఆరోపణల్లో తప్పేమీ లేదు. రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా వెంటనే పులివెందుల పంచాయితిని సాగనివ్వమంటూ చంద్రబాబు అండ్ కో ఒకటే గగ్గోలు పెట్టేస్తున్నారు.

అసలు పులివెందుల పంచాయితి అంటే ఏమిటో ఎవరికీ అర్ధం కావటం లేదు. జగన్ సిఎం కాబట్టి పులివెందుల పంచాయితి అన్నపుడు తాను సిఎంగా ఉన్న కాలంలో జరిగిన వాటికి కుప్పం పంచాయితి అంటే ఒప్పుకునేవారేనా ?

చంద్రబాబుకైనా టిడిపి నేతలకైనా ఓ విషయం బాగా తెలుసు. అదేమిటంటే ఎదుటివారి మొహంపై బట్ట కాల్చి మీదేసేయటం. బట్టకాల్చి మీద వేసేది వాళ్ళే మొహానికి మసి అయ్యిందని ఆరోపించేది వాళ్ళే. అందుకనే చంద్రబాబు మూతిమీద అట్లకాడ కాల్చి వాత పెట్టాలని చెప్పింది.