సంచలనం రేపిన ఢిల్లీ నిర్భయ ఘటన లో దోషులైన నలుగురిని ఉరి తీసేందుకు కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో నిందితుల్లో ఒకడైన వినయ్ .. క్షమాబిక్ష కోరుతూ రాష్ట్రపతికి అర్జీ పెట్టుకున్నాడు. అయితే రాష్ట్రపతి దగ్గర ఈ దోషికి చుక్కెదురైంది. ఎట్టి పరిస్థితుల్లో క్షమాబిక్ష ఉండదంటూ రాష్ట్రపతి వినయ్ పిటిషన్ ను తిరస్కరించడం జరిగింది. నిర్బయ దోషులకు ఏఈ రోజు ఉదయం 6 గంటలను ఉరి తీయాల్సి ఉంది . .అయితే ఢిల్లీ కోర్టు శుక్రవారం స్తే ఇచ్చిన నేపథ్యంలో తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఈ స్టే అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. శిక్ష నుండి తప్పించుకునేందుకు తమకు ఇంకా న్యాయపరమైన అవకాశాలు ఉన్నాయని, అవన్నీ పూర్తయ్యే వరకు ఉరిని వాయిదా వేయాలని దోషులు కోరిన పిటిషన్ విచారించిన న్యాయస్థానము ఈ మేరకు తీర్పు చెప్పింది.
అర్ధరాత్రి ఢిల్లీ లోని ఓ బస్సులో నిర్భయ అనే అమ్మాయిపై పైశాచికంగా అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటన అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు దోషులను పట్టుకుని శిక్షించింది. ఈ నేపథ్యంలో ఈ నలుగురు దోషులకు ఉరిశిక్షే సరైన శిక్ష అంటూ కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో అందులో ఇద్దరు ఇంతకు ముందే రాష్ట్రపతి ని క్షమాబిక్ష పిటిషన్ పెట్టుకుంటే రాష్ట్రపతి వారికీ క్షమాబిక్ష పిటిషన్ ను కొట్టివేశారు. దోషులకు ఉరి సరైనదే అంటూ అయన తీర్పు ఇచ్చిన నేపథ్యంలో మళ్ళీ ఆ దోషుల్లో ఒకడైన వినయ్ తాజాగా మరో పిటిషన్ పెట్టడం జరిగింది. సో త్వరలోనే ఓరి తీసేందుకు మరో డేట్ ని కోర్టు ప్రకటించే అవకాశం ఉంది. అయితే నిర్భయా దోషులకు ఇంకా ఉరి వేయకుండా తాత్సారం చేస్తున్నారంటూ ప్రభ్హుత్వం పై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.