తెలుగోడు స్థాపించిన ఆంధ్ర బ్యాంకుకు తెలుగింటి కోడలుచే స్వస్తి!

ఆంధ్ర పితామహుడు ఒక నాడు స్వాతంత్య్ర పోరాట కాలంలో జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవి అలంకరించిన డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్యచే నెలకొల్ప బడిన ఆంధ్ర బ్యాంకు ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి కనుమరుగు కానున్నది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పలు బ్యాంకులను విలీనం చేస్తూ తీసుకున్న సమయంలో ఆంధ్ర బ్యాంకును యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేశారు.

అయితే ఆంధ్ర ప్రదేశ లో ఈ విలీనం వ్యతిరేకించుతూ అన్ని రాజకీయ పార్టీలు పలువురు ప్రముఖులు ఆంధ్ర బ్యాంకు అదే పేరుతో వుండాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కాని ఈ విజ్ఞప్తులను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆంధ్ర ప్రదేశ్ కు చెంది అన్ని విషయాల్లో కేంద్ర ప్రభుత్వం శీత కన్ను సహజ నైజమైనట్లే భావోద్వేగంతో కూడిన ఈ అంశంలోనూ కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తులను ఖాతరు చేయలేదు. తొలుత ప్రైవేటు బ్యాంకుగా వున్నా బ్యాంకులు జాతీయం జరిగినప్పుడు ప్రభుత్వ రంగ సంస్థగా అవతరించింది.

ఆంధ్ర పితామహుడుగా ప్రసిద్ది కెక్కిన భోగ రాజు పట్టాభి సీతారామయ్య 1923లో నెల కొల్పిన ఆంధ్ర బ్యాంకు తెలుగింటికి కోడలుగా వచ్చిన కేంద్ర మంత్రి నిర్మల సీతారాం హయాంలో కనుమరుగు కావడం గమనార్హం.ఈ బ్యాంకు కేంద్ర కార్యాలయం హైదరాబాద్ లో వుంది. దాదాపు 20 వేల మంది సిబ్బందితో 2885 బ్రాంచీలతో పని చేస్తోంది.