తిరుచానూరు అమ్మవారు గుడిలో ఎస్ ఐ జులుం

తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ఎస్‌.ఐ. రామాంజనేయులు నియమాలు అతిక్రమించి వివాదంలో పడ్డారు. అమ్మవారి ఫోటో లు తీయడమే కాకుండా నివారించేందుకు ప్రయత్నించిన ఆలయ సిబ్బంది మీద  విరుచుకుపడ్డారు. ఈరోజు
పుదుచ్ఛేరి సీఎం నారాయణ స్వామి  వెంట ఎస్ ఐ  గర్భాలయానికి వచ్చారు. ఆలయ మర్యాద కాదని ఆయన తన వెంట సెల్ ఫోన్ కూడా తీసుకు వెళ్లారు.  ముఖ్యమంత్రి నారాయణస్వామి అమ్మవారిని దర్శించుకుంటుండగా ఎస్ ఐ  సెల్‌ఫోన్‌తో దృశ్యాలు చిత్రీకరించడం మొదలుపెట్టారు. ఎవరూ ఈ పని చేయరు. గర్భగుడిలోనే కాదు, ప్రాంగణంలో ఎక్కడా ఫోటోలు తీయడం నిషధం. అయితే, ఎస్‌.ఐ.
నిబంధనలకు విరుద్ధంగా విఐపి దర్శనాన్ని చిత్రీకరించడాన్ని అధికారులు  ప్రశ్నించారర.  వారు వెంటనే ఆలయ సూపరింటెండెంట్‌ రవికి ఫిర్యాదు చేశారు. ఆయన ఎస్ ఐ నివారించే ప్రయత్నం చేశారు. దీనితో ఆగ్రహించిన ఎస్ ఐ
ఆలయ సూపరింటెండెంట్‌ రవిని రకరకాలుగా దుర్భాషలాడారు. చివరకు రామాంజనేయులు తీరుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ
ఘటనపై విచారణకు జేఈవో పోలా భాస్కర్‌ విచారణకు  ఆదేశించారు. ఇందులో భాగంగా సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తున్నారు.  తితిదే నిఘా, ముఖ్య భద్రతాధికారి శివకుమార్‌రెడ్డి ఈ వ్యవహారం పై విచారణ చేస్తున్నారు.