ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దు తీర్మానం ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. నిన్న అసెంబ్లీలో శాసన మండలి రద్దు తీర్మానం ప్రవేశ పెట్టగా దానికి అనుగుణంగా 133 ఓట్లు వచ్చినట్టు స్పీకర్ ప్రకటించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న అంశం ఇదే. ఆంధ్రా ప్రదేశ్ లో శాసన మండలి రద్దు తీర్మానం పై తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి స్పందించారు. పెద్దల సభ రద్దు సరైనది కాదని, ఇది రాజ్యాంగ విరుద్ధమ్మని అన్నారు. ఎపి పరిణామాలను చూస్తుంటే నవ్వాలో, ఏడవాలో తెలియని పరిస్థితిగా ఉందని ఆవేదన వ్యక్తం చేసారు. బిల్లు ఆమోదం పొందలేదన్న కారణంతో సభను రద్దు చేయడం ఏమిటా ? అని ప్రశ్నించారు. ఎన్ని రాజధానులు ఉండాలన్నది మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇష్టమేనని కీలక వ్యాఖ్యలు చేసారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో దోస్తీ వల్లే జగన్ కు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయన్న అనుమానం వస్తోందన్నారు. కేసీఆర్ తో స్నేహం జగన్ కు అంత మంచిది కాదన్నారు. తనను నమ్మిన అందరిని కేసీఆర్ వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. నేతలను పట్టుదల ఉండడం మంచిదే కానీ .. మొండితనం అంత మంచిది కాదని రేవంత్ రెడ్డి హితవు పలికారు. ఈ విషయంలో జగన్ మరోసారి ఆలోచిస్తే మంచిదేమో అన్నారు. మరి రేవంత్ రెడీ వ్యాఖ్యలను జగన్ ఎలా తీసుకుంటారో చూడాలి.