చూస్తుంటే జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైఖరి అలాగే ఉంది. 2019 ఎన్నికల్లో గెలిచేస్తామని, సిఎం పదవి మాదే అని చెప్పుకున్న పవన్ ఆ దిశగా చేసిన ప్రయత్నాలు ఏమిట అంటే మాత్రం శూన్యమనే చెప్పాలి. గట్టిగా రెండు రోజులు జనాల్లో తిరిగితే మళ్ళీ 15 రోజులు అడ్రస్సే కనిపించేవారు కాదు. అలా అలా ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకూ కాలాన్ని నెట్టుకొచ్చేశారు.
చివరకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైనా పరిస్ధితిలో మార్పులు కనిపించకపోవటంతో పార్టీని నమ్ముకున్న నేతలపై దెబ్బపడిపోయింది. చివరకు పోటి చేసిన రెండు నియోజకవర్గాల్లో పవనే ఓడిపోయారంటే పరిస్ధితి ఎంతగా దిగజారిపోయిందో అర్ధమైపోతోంది.
ఎన్నికల తర్వాత పవన్ దాదాపు అడ్రస్సే లేదని చెప్పాలి. ఏదో పార్లమెంటు నియోజకవర్గాల సమీక్షలంటూ నాలుగు రోజులు హడావుడి చేసిన పవన్ మళ్ళీ ఎక్కడా కనిపించలేదు. ఇదంతా చూస్తుంటే పవన్ కు సినిమా షూటింగులు,రాజకీయాలు ఒకటేలాగుందని అనుమానాలు పెరిగిపోతున్నాయి.
సినిమాలు కూడా ఆరోజుకు షూటింగ్ అయిపోగానే ప్యాకప్ చెప్పేస్తారు. ఎన్నికలైపోయాక పవన్ రాజకీయాలు కూడా అలాగే చేస్తున్నారు. ఈ పరిస్ధితుల్లో తొందరలో జరగబోయే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో పవన్ ఏం చేస్తారో చూడాల్సిందే.