రివర్సు టెండరింగ్ వ్యవహారంలో ప్రజాధానం పెద్ద ఎత్తున ఆదా అవుతోంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వినూత్నంగా మొదలుపెట్టిన రివర్స్ టెండర్ విధానం సత్ఫలితాలనే ఇస్తోంది. తాజాగా జెన్కో కు బొగ్గు సరఫరా కోసం పిలిచిన రివర్స్ టెండర్లలో ప్రభుత్వానికి రూ. 164 కోట్ల రూపాయలు ఆదా అవ్వటం ఆశ్చర్యంగా ఉంది.
విద్యుత్ ఉత్పత్తి కోసం జోన్కో ప్రతీ ఏడాది లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గును కొంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. కొనుగోలు చేసే బొగ్గును కూడా వివిధ ప్రాంతాల్లో ఉండే బొగ్గు గనుల నుండి సేకరిస్తుంది. కాబట్టి బొగ్గు కొనటానికి అయ్యే ఖర్చుకు కొనుగోలు చేసిన రవాణాను జెన్కో చెప్పిన చోటకు సరఫరా చేయటానికి కూడా కోట్ల రూపాయలు ఖర్చవుతుంది.
అదే పద్దతిలో ఇపుడు కూడా బొగ్గు రవాణాకు టెండర్లను పిలిచింది. ఒడిస్సా రాష్ట్రంలోని మహానది కోల్ ఫీల్డ్స్ నుండి రాష్ట్రంలోని కృష్ణపట్నం విద్యుత్ ప్లాంటుకు బొగ్గు సరఫరా కోసం టెండర్లను ఆహ్వానించింది. సరే రెగ్యుల్ టెండర్ల తర్వాత రివర్స్ టెండర్లను కూడా పిలిచింది.
ఈ రివర్స్ టెండర్ లో మహానది కోల్ ఫీల్డ్స్ నుండి కృష్ణపట్నం ప్లాంటుకు 36.75 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు సరఫరాకు సుమారు రూ. 164 కోట్లు మిగిలింది. గతంలో టన్ను బొగ్గు సరఫరాకు రూ. 1370 కోట్ చేస్తే రివర్స్ టెండర్లలో అదే టన్ను బొగ్గు సరఫరాకు రూ. 1146 కే ఫైలన్ అయ్యింది. అంటే రెడేళ్ళ కాంట్రాక్టులో 164 కోట్ల రూపాయల ప్రజాధనం ఆదా అయినట్లే లెక్క.