వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రోజా చంద్రబాబు పై రాజధాని విషయంలో మండిపడుతున్నారు. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు రాష్ట్రంలోని గ్రామాలన్నిటికీ ఆయనేమన్నా విపక్షనేతనా అంటూ విమర్శిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు మొదలుకానున్న నేపధ్యంలో మీడియాతో ఆమె మాట్లాడుతూ… చంద్రబాబు పై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు రౌడీయిజం చేయాలనుకుంటున్నాడు ఛలో అసెంబ్లీ అంటూ అసెంబ్లీని కూడా ముట్టడించే కార్యక్రమాన్ని చేస్తున్నాడు అని అన్నారు. ఇలాంటి పనులకు ఒడిగటట్టే ఈయనను ఏమనాలో కూడా మనమందరం ఒకసారి ఆలోచించాలి అన్నారు. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి చెబుతూ… ఒక తల్లి తనకు పుట్టిన ముగ్గురు పిల్లలను సమానంగా చూస్తుంది. తిండి పెడితే ముగ్గురికి సమానంగా పెడుతుంది. సమానంగా చదువు చెపుతుంది. ముగ్గురు కూడా సమానంగా వారి జీవితాల్లో సెటిల్ అవ్వాలని ఆకాంక్షిస్తుంది. అదే విధంగా జగన్మోమన్ రెడ్డిగారు ఈ రోజు 13 జిల్లాలకు ముఖ్యమంత్రిగా మూడు ప్రాంతాల ప్రజలకు అభివృద్ధిని అదే విధంగా నీటిని ఉద్యోగ అవకాశాలను అన్నీ కూడా సమానంగా అందివ్వాలనుకుంటున్నారు. సామాజిక న్యాయం చేయాలన్న ఆలోచనతో ముందుకు వెళుతున్నారన్నారు.
అలాగే పదేళ్ళ ఉమ్మడి రాజధానిలో హైదరాబాద్ నుంచి ఆయన ఎందుకొచ్చారని ఎదురు ప్రశ్నించారు. ఆయన పాలనలో అమరావతిలో ఒక్క శాశ్వత భవనాన్ని కూడా నిర్మించలేదన్నారు. ఏ అనుభవం ఉందని నారాయణ అధ్యక్షతన కమిటీ వేశారని రోజా ప్రశ్నించారు. అసెంబ్లీలో 151 మంది ఎమ్మెల్యేలకు రెండు బాత్‌రూమ్‌లేనా? అని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎన్నో ప్రలోభాలు పెట్టినా.. తడిగుడ్డలో చెప్పు పెట్టి కొట్టినట్టుగా ప్రజలు ఓడించారని రోజా తెలిపారు.
రాజధాని లేకుండా ఇన్నాళ్ళు రాష్ట్రాన్ని అనాధ చేసింది చంద్రబాబు కాదా అంటూ ప్రశ్నించారు. అలాగే ఆయన అధికారంలో ఉన్నప్పుడు రాజధాని కట్టడాలకు అయ్యే ఖర్చు ఒకవిధంగా చెప్పి ఇప్పుడేమో ఒక విధంగా తెలుపుతున్నావంటే… మిగిలిందంతా మింగేయదల్చుకున్నావా అంటూ ఎద్దేవ చేశారు. లోకేష్‌ను పప్పు అని ఊరికే అనరు. జిఎన్ రావ్ కమిటీ ఎవరు వారి కమిటీలో చెబితే చేసేయాలా అన్నాడు. ఇదే లోకేష్‌ను సూటిగా ప్రశ్నిస్తున్నా అంటూ నారాయణకి రాజధాని కట్టిన అనుభవం ఉందా అంటూ ప్రశ్నిస్తున్నారు. కనీసం తన కాలేజీలో బాత్ రూమ్‌లు కూడా లేవని అన్నారు. ఐదేళ్ళ పాటు మహిళలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. తడిగుడ్డలో చెప్పుపెట్టి కొట్టినట్లు ఓడించారు ప్రజలు అని అన్నారు. ప్రతిపక్షనాయకుడా పనికిమాలిన నాయకుడా అన్న అనుమానాలు కడూ వ్యక్తమవుతున్నాయి అన్నారు.
40 ఏళ్ల కుర్రాడు వేసిన దెబ్బకు.. చంద్రబాబు జోలె పట్టి అడుక్కుతింటున్నారని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఆడవారికి భద్రత లేదు అన్నారు.