జనసేన పార్టీకి వివి లక్ష్మీనారాయణ గారు రాజీనామా చేయటం వలన, జనసేన పార్టీకి ఎటువంటి ఇబ్బంది లేదు. కారణం వ్యక్తులను చూసి, జనసేన పార్టీని స్థాపించ లేదు. వ్యక్తుల కోసమే ఏర్పడిన పార్టీ జనసేన కాదు. 2014 నుంచి పార్టీ ఏర్పడినా, ఏవరిని బడితే వారిని పార్టీలోకి ఆహ్వానించలేదు. ప్రతీ ఒక్కరికి రాజకీయాలలో పదవుల కోసమైతే, నా పార్టీలోకి రావద్దన్నారు. కేవలం సమాజానికి సేవ చేయాలంటే మాత్రమే మరియు 25 సంవత్సరాల రాజకీయాలకు ఇష్టపడితేనే రమ్మని చెప్పటం జరుగుతుంది. అలా నమ్మి వచ్చిన వారికి, అయన సాదరంగా ఆహ్వానించి వారిని గౌరవిస్తూన్నారు.
ఇకపోతే వివి లక్ష్మీనారాయణ గారు జనసేన పార్టీలో మొదటి నుంచి లేరు. కేవలం ఎన్నికలకు కోద్ది సమయం ముందు మాత్రమే పార్టీలోకి రావటం జరిగింది. అలా రాగానే, బోలిశెట్టి సత్యనారాయణ గారి కోసమని కేటాయించిన విశాఖపట్నం పార్లమెంటు సీటును, లక్ష్మీనారాయణ గారికి ఇవ్వటం జరిగింది. కాకపోతే ప్రజాతీర్పు సానుకూలంగా రాలేదు.
నాటి ఎన్నికలు సమయం నుంచి అయన పార్టీ ఎదుగుదల కోసం పని చేసిన దాఖలాలు లేవు. సోంతంగా కార్యకలాపాలు చేసుకుంటున్నారు. అప్పుడప్పుడు మాత్రమే పార్టీ కార్యకలాపాలు చూసేవారు. వారిని రాయలసీమ కార్యకలాపాలు చూడమని, అ ప్రాంతం ఇంచార్జ్ గా నియమించారు పవన్ కళ్యాణ్ గారు. కానీ ఎక్కడా పాల్గోన్న దాఖలాలు లేవు.
ఇకపోతే వారు చెప్పిన కారణం ఏమాత్రం సమంజసంగా లేదు. పవన్ కళ్యాణ్ గారు సినిమాలలో నటిస్తున్నారు, అన్న మాట తప్పారు కాబట్టి, అయన నిలకడలేని విథానాలు నచ్చక రాజీనామా చేస్తూన్నాను అని చెప్పటం మాత్రం, నిజంగా శోచనీయం. కారణం పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కన రాజకీయాలకు అందుబాటులో ఉంటునే, రాత్రి సమయంలోనూ, ఖాళీ సమయంలోనూ సినిమా చేస్తూన్నారు. నిన్న చెప్పిన సినిమా రెండోవ సినిమా మాత్రమే. కాబట్టి, లక్ష్మీనారాయణ గారు పవన్ కళ్యాణ్ గారు సినిమాలో నటిస్తున్నారు కాబట్టి అన్నప్పుడు, మొదటి సినిమా షూటింగ్ మొదలు పెట్టినప్పుడే రాజీనామా చేసినట్లైతే, అయన చెప్పిన కారణం హేతుబద్ధంగా ఉండేది. రెండో సినిమా ప్రారంభ సమయంలో ఇలా చేయటంలో హేతుబద్ధత లేదు.
ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు నిజంగానే సినిమాలలో నటించకూడదు అని అనుకున్నారు. ప్రజల నుంచి వచ్చిన విరాళాలతో ఎల్లకాలం పార్టీని నడపటం అయనకు ఇష్టం లేదు. ఈమథ్యన దాసరి రాము గారు కూడా చెప్పటం అందరం విన్నాము. తన కన్నపిల్లల భవిష్యత్తు అవసరాలు కోసం ఉన్న ఫిక్సెడ్ డిపాజిట్ల సోమ్ము రద్దు చేసుకోని మంగళగిరి ప్రాంతంలో పార్టీ కేంద్ర కార్యాలయం మరియు గృహ నిర్మాణం చేసుకున్నారు. కారణం అయన ఇతరుల సోమ్ముతో కులకటం ఇష్టం లేదు. ప్రజారాజ్యం సమయంలో చిరంజీవి గారి పైన పడిన చెడు ప్రచారం, తన పార్టీ విషయంలో రాకూడదని, అయన తన సోంత సోమ్ము మాత్రమే ఖర్చు చేస్తూ, పళ్ళు బిగువునా పార్టీని నడుపుతూ, ముందుకు అడుగులు వేస్తూన్నారు ప్రజాక్షేమం, సంక్షేమం థ్యేయంగా.
అందుకే ప్రతీ జిల్లాలో కూడా పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని తలచారు. అందుకోసం అయన ఇతరుల సోమ్ములు అశించటం లేదు. ప్రతీ పార్టీ కార్యాలయం తన కష్టార్జితమైన సోమ్ముతోనే వచ్చే ఎన్నికలు సమయానికి ఏర్పాటు చేయాలి అని భావించారు. అందుకే అయన తనకు తెలిసిన ఏకైక విద్య, వ్యాపకం అయిన సినిమాలలో మరలా నటించటానికి ఇష్టం లేకపోయినా అంగీకరించారు. కానీ ఎక్కడా, ఎప్పుడూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా జరగలేదు. ప్రజలలో ఉంటునే, తనకు మిగిలిన ఖాళీ సమయంలోనే సినిమాలు, ఎటువంటి శారీరక విశ్రాంతి ఇవ్వకుండా చేసుకుంటున్నారు. నిజంగా మానవ మాత్రుడు అనేవాడు ఏవరూ కూడా కష్టపడనట్లుగా పవన్ కళ్యాణ్ గారు కష్టపడుతున్నారు. తన శరీరాన్ని తానే శిక్షించుకుంటున్నారు. నిజంగా అయనకు సోమ్ములు సంపాదించాలంటే సినిమాలు చేయనక్కర్లేదు. అంతర్జాతీయ స్థాయి సంస్థలకు యాడ్ లు చేసినా వందల కోట్లు రుపాయలు వస్తాయి. కానీ అది అయనకు ఇష్టం లేదు. ఈరోజు సినిమాలలో నటించినా, అవి సమాజానికి సందేశం ఇచ్చే సినిమాలలో మాత్రమే చేస్తూన్నారు తప్పితే, భాథ్యతారాహిత్యంతో వేథవ సినిమాలు చేయటం లేదు. పైగా ఈ సినిమాలు చేయటానికి కారణం మరలా రాబోయే ఎన్నికలు సమయం వరకు, పార్టీ నడిపించటం కోసమే తప్పితే, తన స్వంత ఖర్చులు, కుటుంబం కోసం మాత్రం కాదు. ఇది జనసైనికులు, ప్రజలు గమనించండి. అయన ప్రతీ విషయాన్ని అందరితో పంచుకోరు. ఇబ్బందులు ఉంటే, అయన పడతారు, సుఖాలు మాత్రమే ఇతరులతో పంచుకుంటారు. అది అయన నైజం.
అయన పార్టీకి చెందిన అస్థులను ప్రతీ దానిని తన కష్టార్జితమైన సోమ్ము తోనే సాథించుకోవాలని అనుకుంటున్నారు. దీనికి కారణం కూడా ఉన్నది. గతంలో ప్రజారాజ్యం పార్టీకి హైదరాబాదులో ఒక వ్యక్తి తన సోంత స్థలాన్ని లీజుకు ఇచ్చి పార్టీ కార్యాలయం ఏర్పాటుకు అంగీకరించారు. కానీ నాడు సదరు ప్రజారాజ్యం పార్టీకి సానుకూలంగా ఓట్లు రాకపోవడంతో వెంటనే తన సోంత స్థలాన్ని తిరిగి ఇచ్చేయమని అడగటం, పవన్ కళ్యాణ్ గారు బాగా గుర్తు పెట్టుకున్నారు. అందుకే ఎక్కడ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసినా, అది తన సోంత స్థలంలో మాత్రమే జరగాలి అని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని మాకు చాలా స్పష్టంగా చెప్పటం కూడా జరిగింది.
నిజానికి ఇతర రాజకీయ పార్టీ అథినాయకులు మాదిరిగా పార్టీ నాయకుల నుంచి పార్టీ కోసం ఖర్చులు చేయించటం లేదు. ఆయనకున్న ఏకైక అదృష్టం ఏమిటంటే, అయన ఏదైనా బహిరంగ సభకు కానీ, ప్రదర్శనకు కానీ పిలుపు ఇస్తే, కేవలం మీటింగ్ ప్రాంతంలో మైకు, విద్యుత్, బారికేడ్లు ఖర్చు మాత్రమే అవుతుంది. ఇక కార్యకర్తలు, అభిమానులు వారి వారి స్వంత ఖర్చుతో అయన చెప్పిన దానికి వచ్చి, తమ తమ వంతుగా భోజనాలు, మంచినీరు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇది అయన పైన కరుడుకట్టిన జనసైనికులకు, అభిమానులకు ఉన్న ప్రేమాభిమానాలు. కాబట్టి జనసేన పార్టీ నిజంగా ఈవిషయంలో చాలా అదృష్టం చేసుకున్నది. అదే మిగిలిన పార్టీలకైతే జనసమీకరణ కోసం కోట్లు రుపాయలు ఖర్చు అవుతుంది. ఇంత వరకు జనసేన పార్టీకి, జనసేనానికి ఒత్తిడి లేదు. అదే నేటికి శ్రీరామ రక్ష. కాబట్టి, దయచేసి జనసైనికులు ఎవరూ కూడా అందోళన పడాల్సిన అవసరం లేదు. గందరగోళానికి గురి కావాల్సిన అవసరం లేదు.
ఒకనాడు అల్బర్ట్ ఐనస్టీన్ మహత్మ గాంథీ గురించి ఒక మాట చెప్పారు. భవిష్యత్తు తరాలు ఈ భూమి మీద ఇటువంటి వ్యక్తి ఒకరు జన్మించారు, నడయాడారు అంటే ఎవరూ నమ్మరు అని. అలాగే భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు లాంటి మహనీయులు కథనాలు విన్నాము. రేపు భవిష్యత్తులో కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా అలాగే చెప్పుకుంటారు. అటువంటి వ్యక్తి యొక్క భావజాలంతో ప్రభావితమై, వారితో అడుగులో అడుగులు సమాజమార్పు గురించి వేస్తూన్నందుకు నాకు గర్వకారణం. ఎవరున్నా, లేకున్నా అయనతోనే నా పయనం, అయన ఆశయాలు సాథనే నా గమ్యం.